NTV Telugu Site icon

SC Classification: నేడు జలసౌదాలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

Uttam

Uttam

SC Classification: ఈ రోజు జలసౌదాలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రెండు కేబినెట్ సబ్ కమిటీల సమావేశాలు జరగనున్నాయి. మంత్రి ఉత్తమ్ చైర్మన్ గా ఉన్న రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీల సమావేశాలు జరగబోతున్నాయి. ఇవాళ ( సోమవారం) సాయంత్రం 4 గంటలకు ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. చైర్మన్ ఉత్తమ్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. వర్గీకరణ అమలుకు సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది. ఈ మీటింగ్ లో కో చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొంటారు.

Read Also: SSMB 29 : రాజమౌళి – మహేశ్ బాబు సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే..?

అలాగే, నేటి మధ్యాహ్నం 2 గంటలకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన జరగనుంది. సమావేశంలో మంత్రులు దామోదర్ రాజా నర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ కోసం గతంలో ఎమ్మెల్యేలకు, రాజకీయ పార్టీలకు సబ్ కమిటీ లేఖలు రాసింది. వచ్చిన సిఫారసులు, విధి విధానాలు అంశాలపై చర్చించనున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం 3.45 గంటలకు సచివాలయం దగ్గర దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారు.

Show comments