NTV Telugu Site icon

Cab Drivers Protest: ఒకే కారుకు రెండు నంబర్లు.. శంషాబాద్ లో క్యాబ్‌ డ్రైవర్లు నిరసన..

Telangana Cab Drivers

Telangana Cab Drivers

Cab Drivers Protest: హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో క్యాబ్ డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వందలాది క్యాబ్‌లు, ట్యాక్సీలు ఉపాధి కోల్పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు క్యాబ్ డ్రైవర్లు అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి తాము పడుతున్న ఇబ్బందులను వెల్లడించారు. లక్షలు వెచ్చించి కార్లు కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, అయితే చాలా మంది తమ కుటుంబ పోషణకు అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఇతర రాష్ట్రాల నుంచి రోజూ వందల సంఖ్యలో ట్యాక్సీలు, క్యాబ్‌లు వస్తున్నాయని, దీంతో ఉపాధిపై ప్రభావం పడుతుందని వెల్లడైంది. తెలంగాణ రాష్ట్రానికి పన్నులు చెల్లిస్తున్నామని, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తున్న వారు తమ వాహనాలను ఇక్కడ తిప్పుతూ ఉపాధిని దెబ్బతీస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్యాబ్‌లు, ట్యాక్సీలను విమానాశ్రయానికి రాకుండా అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలోని ఐటీ కంపెనీలు, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా తెలంగాణకు చెందిన డ్రైవర్ల వాహనాలను మాత్రమే బుక్ చేయాలని డిమాండ్ చేశాయి.

Read also: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన.. ఎన్‌ఆర్‌ఐలతో రేవంత్ సమావేశం..

రెండు, మూడు రోజులుగా ఎయిర్‌పోర్టులో మకాం వేసినా చాలా మందికి బేరాలు దొరకడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని క్యాబ్ డ్రైవర్లు వెల్లడించారు. తెలంగాణలో నమోదైన వాహనాలను మాత్రమే బుక్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీకి చెందిన కొందరు క్యాబ్ డ్రైవర్లు ఒకే కారుకు రెండు నంబర్లు నడుపుతున్నట్లు వెల్లడించారు. ట్యాక్సీ ప్లేట్‌తో ఒకటి, సొంత నంబర్‌ ప్లేట్‌తో వాహనాలు నడుపుతున్నట్లు సమాచారం. మరికొందరు క్యాబ్ డ్రైవర్లు తాము డ్యూటీలో ఉన్నామని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వమని స్టిక్కర్లు అంటించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని ఆరోపించారు. దీని వల్ల తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఓలా, ఉబర్ ట్యాక్సీలు నడుపుతూ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారని, మరోవైపు ఈఎంఐలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాంటి డ్రైవర్లపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ట్యాక్సీలపై నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన కస్టమర్లతో ప్రయాణిస్తున్న తనను కర్ణాటక పోలీసులు వేధించారని, డబ్బులు చెల్లించినా గమ్యస్థానానికి చేరుకోలేకపోయారని ఆరోపించారు. వారి సమస్యలను పరిష్కరించి న్యాయం చేసేందుకు అధికారులు, ప్రభుత్వ పెద్దలు కృషి చేయాలని క్యాబ్ డ్రైవర్ ప్రసాద్ అన్నారు.
Friendship Day 2024: ఫ్రెండ్ షిప్ డే.. ఎప్పుడు.. ఎలా మొదలైందో తెలుసా..?

Show comments