Site icon NTV Telugu

BRSV State Secretary: బీఆర్ఎస్‌వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్..

Brsv Nagaram Arest

Brsv Nagaram Arest

BRSV State Secretary: బీఆర్ఎస్‌వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగిలో ప్రసాద్ ను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీ యజమానులను ప్రసాద్ ముఠా బెదిరిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. అడ్మిషన్లతో పాటు రూ.10 లక్షలు డబ్బులు కావాలని ప్రసాద్ డిమాండ్ చేస్తున్నట్లు గుర్తించారు. డబ్బులు ఇవ్వని కాలేజీ యజమాన్యాల ఇంటికి వద్దకు వెళ్లి ప్రసాద్ వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులు వివరించారు. ఇంజనీరింగ్ కాలేజీ యజమానుల ఇంటి వద్ద, కాలేజ్ యజమానుల కుటుంబ సభ్యులను ప్రసాద్ ముఠా వేధిస్తున్నట్టు తెలిపారు. యజమాలను చేజ్ చేయడమే కాకుండా వారిని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ లో ఉంటూ ప్రసాద్ ముఠా బెదిరింపులకు పాల్పడుతున్నారని గుర్తించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌వీ నేతల అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ప్రజా పరిపాలనలో ప్రశ్నిస్తే కేసులా? సమస్యలపై నిరసనలు చేస్తే నిర్బంధించాలా? స్కూల్ పిల్లలకు అండగా నిలబడితే అరెస్ట్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ponnam Prabhakar: విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దు.. మంత్రి పొన్నం ఆగ్రహం..

Exit mobile version