NTV Telugu Site icon

BRS Protest: చేతికి బేడీలు, నల్ల చొక్కాలతో బీఆర్ఎస్ వినూత్న నిరసన..

Brs

Brs

BRS Protest: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల చొక్కాలు, చేతికి సంకెళ్లు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే లగచర్ల ఘటనలో రైతులకు సంకెళ్లు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్ష బీఆర్‌ఎస్ నేతలు అసెంబ్లీలో నిరసనకు దిగారు. బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలంతా నల్లచొక్కాలు, చేతులకు బేడీలతో అసెంబ్లీకి వచ్చారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం లాటి రాజ్యం లూటీ రాజ్యం… రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు అంటూ పలు నినాదాలు చేస్తూ అసెంబ్లీలో నిరసన తెలిపారు.

Read also: KP Vivekanand: మహిళా మంత్రితో కేటీఆర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయించారు..

కాగా, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో లగచర్ల, దిలావర్‌పూర్‌, రామన్నపేటతోపాటు పలు ఘటనలపై అసెంబ్లీలో చర్చ జరపాలని బీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. అంతకుముందు పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ, రైతుల అరెస్టులపై బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ అంశాలపై సభలో చర్చించేందుకు అనుమతించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పీకర్‌కు వాయిదా తీర్మానాన్ని సమర్పించారు.
Congress: జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.. లోక్‌సభలో నోటీసు

Show comments