బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధపడింది. ఆటో డ్రైవర్ల సమస్యలే పరిష్కారం దిశగా సోమవారం గులాబీ పార్టీ నేతలు ఆందోళనలు.. నిరసనలకు రెడీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టనున్నారు. ఆటోల్లో ప్రయాణం చేస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
పాల్గొనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు వీళ్లే..
ఎర్రగడ్డలో ఆటోలో ప్రయాణించనున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సనత్ నగర్‌లో ఆటోలో ప్రయాణించనున్న తలసాని శ్రీనివాస్ యాదవ్
వెంగల్‌రావు నగర్‌లో ఆటోలో ప్రయాణం చేయనున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి
షేక్‌పేట్‌లో ఆటోలో ప్రయాణించనున్న ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ భవన్‌లో ఆటో డ్రైవర్లతో సమావేశమై.. అనంతరం తెలంగాణ భవన్ నుంచి ఆటోలో ప్రయాణం చేయనున్న కేటీఆర్
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఫ్రీ బస్సు నడుస్తోంది. దీంతో ఆటో సర్వీసులు పడిపోయాయి. గతంలో కూడా బీఆర్ఎస్ ఇదే రకమైన ఆందోళనలు చేపట్టింది. తాజాగా మరోసారి ఆటో డ్రైవర్లతో కలిసి ఆందోళనలు చేపడతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నిక నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ నాయకులు.. ఆటో డ్రైవర్లతో కలిసి ఆందోళనలు చేపడుతున్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణం చెందారు. దీంతో జూబ్లీహిల్స్‌కు బైపోల్ అనివార్యమైంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఫలితం మాత్రం నవంబర్ 14న విడుదల కానుంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీ నువ్వానేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ పోటీ పడుతున్నారు.
