NTV Telugu Site icon

Kaushik Reddy: నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు..

Kowshik Reddy

Kowshik Reddy

Kaushik Reddy: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును యావత్ తెలంగాణ ప్రజలు చూశారు.. నా ఇంటి పైన ముఖ్యమంత్రి దాడి చేయించారు.. నన్ను రేవంత్ రెడ్డి హత్య చేయాలని అనుకుంటున్నాడు.. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు.. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజల తరుపున నేను ప్రశ్నిస్తుంటే నన్ను చంపాలని చూస్తున్నారు అని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం.. రేవంత్ రెడ్డి పైన హత్యయత్నం కేసు నమోదు చేయాలని డీజీపీనీ డిమాండ్ చేస్తున్నాం.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి కుటుంబానికి మంచి పేరు ఉన్నది.. అవినాశ్ మహంతి తమ్ముడు కరీంనగర్ సీపీ డైనమిక్ గా పని చేస్తున్నాడు.. దగ్గర ఉండి దాడి చేసిన ఏసీపీ, సీఐనీ అవినాష్ మహంతి ఎందుకు సస్పెండ్ చేయలేదు అని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: Karnataka : కర్ణాటకలో ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా హింస.. వీధుల్లోకి వచ్చిన వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ ప్రజలు

ఇక, మేము అధికారంలోకి రాగానే ఏసీపీ, సీఐ సంగతి చూస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నా వీపు చింతపండు అయిందనీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు.. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి వీపు చింతపండు అయింది.. సీఎం రేవంత్ రెడ్డి స్థాయి నా స్థాయి కూడా కాదు… చిల్లర వీధి రౌడిల స్థాయి అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నా కాళ్ళు మొక్కాడు.. నా కాళ్ళు మొక్కిన తరువాతనే రేవంత్ రెడ్డినీ పీసీసీ అధ్యక్షుడునీ చేశామన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డినీ గద్దె దించుడు ఖాయం.. చిల్లర గుండాలతో సీఎం రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేపిస్తున్నాడు.. నన్ను చంపుతాం అని బెదిరిస్తున్నారు.. ప్రజల కోసం నేను చావడానికైన సిద్ధంగా ఉన్నా.. నా జోలికి వచ్చిన వారిని ఖతం పెట్టించిన అని పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Firecrackers Explosion: ఇంట్లో బాణాసంచా తయారీ.. భారీ పేలుడుతో కుప్పకూలిన ఇల్లు..

అలాగే, సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి పైన కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాదాపూర్ లో ఎఫ్టీఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పెదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు.. తిరుపతి రెడ్డి ఇంటికీ నోటీసులు ఇచ్చారు.. ఆయన ఇల్లు ఎందుకు కూలగొట్టడం లేదు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి SLR విల్లాస్ లో శివానంద్ ను బెదిరించి తిరుపతి రెడ్డికీ విల్లా ఇప్పించాడు.. ఒకవేళ తిరుపతి రెడ్డి ఇల్లు కొల్లగొట్టినా ఏమి అనుకోవద్దు అని ఈ ప్లాట్ ఇప్పించాడు.. ఇదీ నిజమా కాదా తిరుపతి రెడ్డి చెప్పాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అడిగారు.