NTV Telugu Site icon

Demolition: మేడ్చల్ లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్..

Medchel Demolition

Medchel Demolition

Demolition: మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే 1లో భారీగా వెలిసిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. సీలింగ్ భూమిలోని నిర్మాణాలు అధికారులు కూల్చివేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. విషయం తెలిసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అధికారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకుంది. అడ్డుకున్న బీఆర్ ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అరెస్టు చేశారు పోలీసులు.. దీంతో బాధితులు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డిలు అధికారులతో వాదోపవాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై పీర్జాదిగుడా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మండిపడ్డారు. పీర్జదిగూడా మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: MLC Challa Venkatamireddy: బీఆర్‌ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. సీఎం రేవంత్‌ను కలిసి చల్లా…

అధికార కార్పొరేటర్ అమర్ సింగ్ ను మేయర్ చేయాలని, అక్రమస్తులను కూడబెట్టుకోవాలని కుట్రలో బాగామే ఈ కూల్చివేతలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మా‌ నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నాము మా‌ నిర్మాణాలకు హెచ్ ఎండీఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అని అనుమతులు ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. రెవెన్యూశాఖ అధికారులు మా‌ స్థలాలకు ఎన్ వోసీ ఇచ్చారని బాధితులు తెలుపుతున్నారు. నిర్మాణాలకు ఆధారాలు ఉన్నాయని అధికారులకు చెబుతున్నా పట్టించుకోకుండా కూల్చివేస్తున్నారని వాపోయారు. ఇలా నిర్మాణాలు కూల్చివేస్తే మేము రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Droupadi Murmu: పూరీ బీచ్లో వాకింగ్ చేసిన రాష్ట్రపతి ముర్ము.. కీలక సందేశం..!