NTV Telugu Site icon

Dr K Laxman: ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే..

Bjp Mp Lakshman

Bjp Mp Lakshman

Dr K Laxman: ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని బీజేపీ ఎంపీ కే.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవంను జరుపుకోవడం ఇది మూడో సారి అన్నారు. అప్పటి ఉదంతాలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం అని తెలిపారు. నిజాం హైదరాబాద్ సంస్థానం నీ భారత్ లో విలీనం చేయను అంటే… ప్రజలు తిరుగుబాటు చేశారని తెలిపారు. నిజాం రజాకార్లు ప్రజల మీద దాస్టికాలకి పాల్పడ్డారన్నారు. చివరకి ప్రజల పోరాటానికి నిజాం తల ఒగ్గక తప్పలేదన్నారు. 1948 సెప్టెంబర్ 17 న విముక్తి లభించిందన్నారు. ఆ స్వతంత్ర దినాన్ని ఇక్కడ జరుపుకోలేని పరిస్థితి అని తెలిపారు. మజ్లిస్ , ఎంఐఎం ఒత్తిడితో తెలంగాణ విమోచన దినోత్సవంను ప్రభుత్వం జరపడం లేదని మండిపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటకలో విమోచన దినం జరుపుకుంటుంటే ఇక్కడ మాత్రం జరుపుకోవడం లేదన్నారు. మజ్లిస్ కు ఇబ్బంది కలుగకుండా గత సీఎం సెప్టెంబర్ 17 ను జాతీయ సమైక్యత దినంగా నిర్వహించారని తెలిపారు. కుహనా మేధావులు, కమ్యూనిస్టులు తెలంగాణ విద్రోహ దినం అంటున్నారని అన్నారు.

Read also: Cabinet Meeting: ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం.. హైడ్రాపై చర్చ..

హైదరాబాద్ దేశంలో విలీనం అయిన తర్వాత కూడా కమ్యూనిస్టులు ఎందుకు పోరాటం చేశారో చెప్పాలన్నారు. మిలటరీతో యుద్ధం దేని కోసం చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి.. కూని రాగాలు తీయడం కాదు… విమోచనం అనే పదం ఎందుకు వాడడం లేదని ప్రశ్నించారు. మొక్కుబడి కోసం ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నారని తెలిపారు. అయినా దాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ విమోచన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవం కార్యక్రమానికి సీఎంను ఆహ్వానించామన్నారు. సీఎం రామని సమాచారం ఇచ్చారన్నారు. మజ్లిస్ ఒత్తిడి కి తలొగ్గి అయన రావడం లేదని తెలిపారు. వారి మెప్పుకోసం పని చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన ఉద్యమాన్ని అవమానించడమే అని అన్నారు. ప్రజా పాలన దినోత్సవం కాదు తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని తెలిపారు. ప్రజాపాల దినోత్సవం అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకుండా ముఖం చాటేయ్యడానికే కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Okra Water: బెండ నీటితో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..

Show comments