NTV Telugu Site icon

BJP MLA Raja Singh: ఉస్మానియాను పేట్ల బురుజు కు షిఫ్ట్ చేయండి..

Mla Raja Singh

Mla Raja Singh

BJP MLA Raja Singh: ఉస్మానియాను పేట్ల బురుజుకు షిఫ్ట్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్ చేశారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. దీనిపై రాజాసింగ్ స్పందించారు. ఉస్మానియా హాస్పిటల్ ను గోషామహల్ గ్రౌండ్ కి తరలించవద్దని అన్నారు. ఎంఐఎంకి భయపడి గోషామహల్‌కి షిఫ్ట్ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియాను పేట్ల బురుజుకు షిఫ్ట్ చేయాలని కోరారు. గోషామహల్ గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్న బస్తీలకి ఇబ్బంది అవుతుందని రాజాసింగ్‌ అన్నారు. ఉస్మానియా హాస్పిటల్ ఉన్న స్థలంలోనే డెవెలప్ చేయాలని సూచించారు. మేయర్ పోస్ట్ పోతుందని విజయలక్ష్మి పార్టీ జంప్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోతి మార్కెట్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని రాజాసింగ్‌ కోరారు.

Read also: CM Revanth Reddy: కేసీఆర్‌… అసెంబ్లీ సమావేశాలకు రండి, సలహాలు ఇవ్వండి..

ఇదిలా ఉండగా ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలని దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలు ఉన్నా అవి ముందుకు సాగలేదు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఇక్కడ కొత్త భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. శంకుస్థాపన జరుగుతుండగా కొన్ని అడ్డంకులు రావడంతో పనులు నిలిచిపోయాయి. వారసత్వ కట్టడాల కంటే కొత్త కట్టడాలు ఎత్తుగా ఉండకూడదని, ఆ నిర్మాణాల ఛాయలు చారిత్రక కట్టడాలపై పడకూడదనే నిబంధనలు అడ్డంకిగా మారాయి. దీంతో అప్పట్లో ఏడు ఎకరాల్లో నూతన భవనాల నిర్మాణానికి సుమారు రూ.2 కోట్ల నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. అనంతరం వారసత్వ కట్టడాలకు ఇబ్బంది లేకుండా ఐదెకరాల స్థలంలో రెండు కొత్త భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Read also: Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరు ఒక్క పైసా ఇవ్వొద్దు..

అయితే అప్పటికి కూడా పనులు ప్రారంభం కాలేదు. ఉస్మానియాలో పర్యటించిన కేసీఆర్.. త్వరలోనే భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు. ఆచరణలో అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఇక్కడ ఉన్న పాత భవనం శిథిలావస్థకు చేరడంతో పూర్తిగా తాళం వేశారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌లో నూతనంగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఏడెనిమిది అంతస్తులు నిర్మించాలని యోచిస్తున్నారు. కొత్త ఆసుపత్రిలో 750 నుంచి 1000 పడకలు ఉండే అవకాశం ఉంది. ఓపీ విభాగంతో పాటు ఇన్ పేషెంట్లకు అవసరమైన వార్డులు, బెడ్లు, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆపరేషన్ థియేటర్లు నిర్మిస్తామన్నారు. సీసీటీవీ నిఘా, అగ్నిమాపక రక్షణకు అనుగుణంగా ఈ భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
Konda Surekha: కౌశిక్ రెడ్డిపై కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు..

Show comments