NTV Telugu Site icon

Dr K Laxman: బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదు..

Mp Dr. Laxman

Mp Dr. Laxman

Dr K Laxman: బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు,రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ లో అసమర్థ పాలన కొనసాగుతోందన్నారు. పాలన వదిలేసి మంత్రులంతా ఢిల్లీకి గులాం గా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యాలయాలన్ని నిర్వీర్యం అయ్యాయని తెలిపారు. గురుకులాల్లో మౌలిక వసతులు లేక విద్యార్థుల మరణ మృదంగా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించేందుకే రేవంత్ సర్కార్ హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. చినుకు పాటు వర్షం వస్తే నగరం సంద్రoలా మారుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో వైద్యం పడకేసిందని మండిపడ్డారు. సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులన్ని రోగులతో కిక్కిరిసి ఉన్నాయన్నారు. కాంగ్రెస్ కు ఓట్లేసినందుకు రాష్ట్ర ప్రజలకు వాతలు, బాధలు తప్ప ఏం లేదన్నారు. మహాలక్ష్మి పథకం నీరు కారిపోయిందని మండిపడ్డారు. బస్సులు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: G. Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ..

31 కోట్లు మాఫీ అన్నారు, రైతులను నిలువునా మోసం చేశారని.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్, దానికి అభివృద్ధి పట్టదు, ప్రజా సంక్షేమం పట్టదన్నారు. కాంగ్రెస్ విధానాలకు రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని మండిపడ్డారు. రైతులు పంట భీమకు నోచుకునే పరిస్థుతులు లేవన్నారు. రైతులకు పంట బీమా లేదు, పసల్ బీమా లేదన్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా కుంటు పడిందన్నారు. బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 40 మందికి పైగా విద్యార్థులు చనిపోయారన్నారు. దిక్లరేషన్ల పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం దిగజారుడు తనానికి నిదర్శనమని, సిద్ధాంతానికి నిదర్శనం బీజేపీ పార్టీ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు హోల్ సెల్ రాజకీయాలకు పాల్పడటం మంచి పద్దతి కాదన్నారు.
CM Revanth Reddy: ఐఐహెచ్‌టీ కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు.. అధికారులకు సీఎం ఆదేశాలు..

Show comments