NTV Telugu Site icon

MLA Maheshwar Reddy: కొడంగల్ ఎత్తివేతల పథకానికి గ్లోబల్ టెండర్లు పిలవాల్సిందే..

Mla Maheshwar Reddy

Mla Maheshwar Reddy

MLA Maheshwar Reddy: తెలంగాణ ప్రభుత్వానికి బీజేఎల్పీ నేత యేలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్ ఎత్తివేతల పథకానికి గ్లోబల్ టెండర్లు పిలవాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ పథకం నిధుల టెండర్లలో జరిగిన అవినీతిని నిరూపించడానికి నేను సిద్ధం అన్నారు. గ్లోబల్ టెండర్లతో 40 శాతం లెస్ కి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే నేను రాజీనామాకు సిద్ధమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు ఉందన్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. జవాబుదారీ తనం లేదు.. పారదర్శకత లేదన్నారు. పేరుకే ప్రజా పాలన.. ప్రజాదర్బార్ కనరాకుండ పోయిందని తెలిపారు.

Read also: Miyapur Crime: అపార్ట్‌ మెంట్‌ నుంచి దూకిన యువతి.. మియాపూర్ లో ఘటన..

ప్రజాపాలన పేరుమీద రాక్షస పాలన సాగుతోందన్నారు. రేవంత్ బాబా 11 మంది దొంగలుగా పాలన నడుస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలన భ్రస్తుపట్టిందన్నారు. రేవంత్ అవినీతి పాలన పై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రజాక్షేత్రంలో అవినీతిని బయట పెడతామని తెలిపారు. 11 వందల 55 లక్షల రూపాయల నిధుల పనులను రేవంత్ బావమరిదికి కట్టబెట్టారని ఆరోపించారు. సుజన్ అటు కవితకు దగ్గరగా ఉంటారు… ఇటు మీరు కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పనులు చేసిన మేఘ కృష్ణారెడ్డికే 40 శాతం అధిక రేట్ల తో కాంట్రాక్టు పనులు అప్పగించారని తెలిపారు. రాష్ట్రంలో పట్టపగలే దొంగలు పడి దోచుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దొంగలతో కలిసిపోయిందా ? అని ప్రశ్నించారు.

Read also: Komatireddy: అప్పుల్లో ఉన్న ఆర్టీసీని గటెక్కించేందుకు పొన్నం ప్రయత్నాలు..

అవినీతి టెండర్ రద్దు చేసి.. గ్లోబల్ టెండర్ పిలవాలని కోరుతున్నా అని డిమాండ్ చేశారు. టెండర్ల డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన గుత్తేదారుల్లో ఒకరు సిఎం తమ్ముడు… మరొకరు ఆయన బావమరిది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాధానం దాటవేస్తే బీజేపీ వదిలిపెట్టేది లేదన్నారు. టెండర్లు రద్దు చేయకపోతే… బీజేపీ తరఫున ఆందోళన చేస్తామన్నారు. కొడంగల్ లో 4 వేల కోట్ల రూపాయల నిధులతో చెప్పట్టనున్న ఎత్తిపోతల పథకాన్ని మేఘా కృష్ణారెడ్డికి గిఫ్ట్ గా ఇచ్చేందుకు సిఎం ఒప్పందం కుదుర్చుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ఎత్తివేతల పథకానికి గ్లోబల్ టెండర్లు పిలవాల్సిందే అని డిమాండ్ చేశారు.
Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో GOAT సేల్‌.. 80 శాతం భారీ డిస్కౌంట్స్‌..