Miyapur Crime: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శృతి అనే యువతి మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్ పై నుండి దూకి ఆత్మహత్య కు పాల్పడింది. శృతిని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం యువతిని మియాపూర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. తీవ్ర రక్త స్రవంతో ఉన్న యువతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే స్థానిక సమాచారంలో సంఘటన స్థలానికి మియాపూర్ పోలీసులు చేరుకున్నారు. యువతి డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read also: Sai Pallavi: అందమైన కుందనాల బొమ్మ.. 6 అవార్డులు గెలిచెనమ్మా..
ఆ అపార్ట్ మెంట్ ను పోలీసులు పరిశీలించారు. అపార్ట్ మెంట్ గదిలో శృతి ఒక్కటే ఉంటోందా? లేక వేరే వారుకూడా ఉంటున్నారా? అనే కోణంలో విచారణ చేపట్టారు. డిప్రెషన్ లో వుంటే దేని గురించి డిప్రెషన్ లోకి వెళ్లిందనేది ఆరా తీస్తున్నారు. శృతి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. అపార్ట్మెంట్ ఓనర్ ను కలిసి శృతి గురించి దర్యాప్తు చేస్తున్నారు. బిల్డింగ్ పై నుంచి శృతి ఎందుకు దూకింది? ఎవరైనా తోసేశారా? అనే అనుమానంతో అక్కడున్న స్థానికులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
టీ తాగితే నిజంగానే తలనొప్పి తగ్గుతుందా..?