NTV Telugu Site icon

Bidar ATM Robbery: హైదరాబాద్‌లో బీదర్ దొంగలు.. పోలీసుల్ని చూసి కాల్పులు

Atm

Atm

కర్ణాటకలోని బీదర్ పట్టణంలో గురువారం పట్టపగలు ఏటీఎం వాహనంపై దోపిడీకి పాల్పడ్డ దొంగలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బీదర్ నుంచి  హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి బీదర్ పోలీసులు దొంగలను వెంటాడుతూ వచ్చారు. అయితే అఫ్జల్‌గంజ్‌లో బీదర్ పోలీసులను చూసి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రోషన్ ట్రావెల్స్‌లో రెండు టికెట్లు కొనుగోలు చేశారు. బస్సులో కూర్చున్నాక పట్టుకుందామని చూస్తే.. ఇంతలోనే పోలీసులపై 3 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్‌కు పారిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులతో కలిసి కర్ణాటక పోలీసులు.. నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Pattudala: అజిత్ ‘పట్టుదల’ ట్రైల‌ర్ అదిరింది.. చూశారా?

బీదర్ పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర సినిమా తరహాలో గురువారం భారీ దోపిడీ జరిగింది. శివాజీ సర్కిల్ సమీపంలోని నగరం నడిబొడ్డున ఉన్న ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ దగ్గర ఎటీఎం‌లో పెట్టడానికి వాహనంలో డబ్బులు తీసికొచ్చారు. ఇంతలో బైక్‌పై మెరుపు వేగంతో వచ్చిన ఇద్దరు దుండగులు.. సిబ్బంది ముఖంపై కారం పొడి చల్లి వారిపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో సీఎంసీ సిబ్బంది గిరి, వెంకటేష్‌ అక్కడికక్కడే మృతిచెందారు. శివ కాశీనాథ్ అనే మరో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న కొందరు నిందితులపై రాళ్లు రువ్వారు. తుపాకీతో బెదిరించడంతో స్థానికులు పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతరం రూ.93 లక్షల నగదు తీసుకుని నిందితులు పారిపోయారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీని పుటేజీలను పరిశీలించి.. నిందితుల కోసం వేట ప్రారంభించారు.