NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది..

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka: లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయన్నారు.

Read also: Friends Rape: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై స్నేహితుల సామూహిక అత్యాచారం.. హోటల్ కు తీసుకుని వెళ్లి..

వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పినట్టు మాఫీ చేస్తున్నామన్నారు. డిక్లరేషన్ ప్రకటించినప్పుడు చాలామంది అనుమానాలను వ్యక్తం చేశారని తెలిపారు. సాధ్యం కాదనుకున్నవాళ్లకి మేం రుణమాఫీ చేసి చూపిస్తున్నామని తెలిపారు. 1580 కోట్లు రైతు బీమా కింద ప్రభుత్వమే కడుతుందన్నారు. క్రాఫ్ ఇన్స్యూరెన్స్ 1350 కోట్లు చేయబోతున్నామన్నారు. రాష్ట్ర రైతులకు ఇవాళ పండగ రోజని తెలిపారు. బీఆర్ఎస్ లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతల చేసిందని గుర్తు చేశారు. చివరి విడత సగం వదిలేసిందని తెలిపారు. సాధ్యం కాదనుకున్న వాళ్ళకి రుణమాఫీ చేసి చూపిస్తున్నామన్నారు.

Read also: Nirmal Crime: రన్నింగ్‌ బస్సులో మహిళపై అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కి..!

తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. దేశ రాజకీయాల్లో ఇది చారిత్రక ఘట్టమని తెలిపారు. ఆనాడు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ..అదే తరహాలో రేవంత్ అధ్యక్షతన 31,000 కోట్ల రుణమాఫీ చేస్తున్నారని తెలిపారు. అప్పులో ఉన్న రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నారు. పంటల బీమాని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. పంటల బీమాని కొనసాగిస్తున్నామని.. ఎన్ని ఇబ్బందులు ఉన్న రైతు భరోసాని కూడా అమలు చేస్తామన్నారు. త్వరలోనే రైతు భరోసా విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. ఆయిల్ ఫార్మ్ పంటను ప్రోత్సహించాలని కోరారు.
Telangana Assembly: నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దు.. సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి..