NTV Telugu Site icon

Mallu Bhatti Vikramarka: రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించండి.. వాటాను 50% పెంచండి..

Mallu Bhatti Vikramrka

Mallu Bhatti Vikramrka

Mallu Bhatti Vikramarka: రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలనిప్రజాభవన్ లో నిర్వహిస్తున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు కోరారు. పన్నుల నుంచి మాకు వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటివి.. ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసాలు, అధిక భద్రతను కల్పిస్తాయని తెలిపారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు. ఫలితంగా కేంద్ర ప్రాయోజిక పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. రాష్ట్రాలు తమ అవసరాలు కనుగుణంగా కేంద్ర ప్రయత పథకాలను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని అందించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం కీలక దశలో ఉన్నది. ఆదికంగా వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు.

Read also: Lakshma Reddy: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత.. కేసీఆర్ సంతాపం

గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 6.85 లక్షల కోటప్ప పైగా రుణపాఠంతో సతమతం అవుతున్నదన్నారు. సెస్ లు, సర్ చార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కోరారు. స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉన్నదన్నారు. సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయడం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉంది. ఇది తెలంగాణ డిమాండ్ కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించినదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. చారిత్రిక కారణాలవల్ల అసమాన అభివృద్ధి ఇక్కడ ఉన్నదని తెలిపారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ సంపద, ఆదాయం పెద్ద అంతరం ఉంది.. ఇలాంటి అసమానతలు మూలంగానే రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైంది. సమాన తల పరిష్కారానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందన్నారు.
Bhadrachalam Godavari: భద్రాచలం వద్ద మరోసారి విజృంభిస్తున్న గోదావరి..