Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఏడాది పాలపై ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పిల్లలకు పురుగులన్నం పెట్టడం విజయమని కీలక వ్యాఖ్యలు చేశారు. వారి చావులు కాంగ్రెస్ కి ఉత్సవమా అని ప్రశ్నించారు.యువతకు ఉద్యోగాలివ్వకపోవడం విజయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సంకెళ్లేయడం ఉత్సవం అని మండిపడ్డారు. రైతులను మోసం చేయడం విజయం.. వారికి ఉరితాళ్లేయడం ఉత్సవం అని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: HYD Cyber Crime Police: తస్మాత్ జాగ్రత్త.. ఈ నంబర్ల నుంచి ఫోన్ వస్తుందా? లిప్ట్ చేయొద్దు..
ఆడబిడ్డలకు ఆగం చేయడం విజయం.. వారి కన్నీళ్లు ఉత్సవం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండ్లు ఇస్తమని మోసం చేయడం విజయమా అని ప్రశ్నించారు. ఉన్న ఇండ్లు కూల్చడం ఉత్సవం అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. రుణమాఫీ చేస్తమని మాట తప్పడం విజయం అన్నారు. అప్పులకు నోటీసులివ్వడం ఉత్సవం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా? అన్నారు. ప్రజల చావులు, గోసలే ఉత్సవమా? అని ప్రశ్నించారు. ఇవి విజయోత్సవాలు కాదు.. వికృత ఉత్సవాలు అని బండి సంజయ్ తన ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ ఏడాది పాలనపై మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ దృష్టిలో..
➡ పిల్లలకు పురుగులన్నం పెట్టడం విజయం. వారి చావులు ఉత్సవం.
➡ యువతకు ఉద్యోగాలివ్వకపోవడం విజయం. వారికి సంకెళ్లేయడం ఉత్సవం.
➡ రైతులను మోసం చేయడం విజయం. వారికి ఉరితాళ్లేయడం ఉత్సవం.
➡ ఆడబిడ్డలకు ఆగం చేయడం విజయం..వారి కన్నీళ్లు ఉత్సవం.
➡ ఇండ్లు…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 4, 2024
AlluArjun : ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 70MMకు అల్లు అర్జున్