NTV Telugu Site icon

Bandi Sanjay: రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారింది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచులు బిచ్చగాళ్ళలాగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధ్యానం కొనుగోళ్ళు వెంటనే చేబట్టాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ ఎంతమందికి అయ్యింది? అని ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫి టైం పాస్ గా మారిందన్నారు. మోడీ మీద యుద్ధం చేయడం కాదు, యుద్దప్రాతికనా రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలన్నారు. కుల గణనకి మేం వ్యతిరేకం కాదు, పారదర్శకంగా కులగణన జరగాలని తెలిపారు. అమృత్ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. రూ.7000 కొట్ల రూపాయలు అమృత్ స్కీం ద్వారా తెలంగాణకి నిధుల కెటాయింపు జరిగిందన్నారు. పార్టీలకి అతితంగా అందరం కలిసి నగర అభివృద్ధి చేసుకుందామన్నారు.

Read also: Kishan Reddy: గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నత విద్య పొందిన వారే టీచర్స్ గా ఉంటారు..

రెండు లక్షల తొంభై తొమ్మిది వేలు అమృత్ స్కీం ద్వారా కెటాయించడం అంటే మాటలు కాదన్నారు. పగలు పట్టింపులు ప్రక్కన బెట్టి అభివృద్ధి కి అందరం సహాకరిద్దామన్నారు. టెంపుల్ టూరిజం ద్వారా వేములవాడ,ఇల్లంతకుంట అభివృద్ధి చేస్తామన్నారు. కరీంనగర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం కట్టడానికి నావంతు కృషి చేస్తానని తెలిపారు. మాజీ సర్పంచుల అరెస్టు దుర్మార్గం అన్నారు. సర్పంచ్ లు అప్పుల పాలవ్వడానికి కారకులు బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ లే అన్నారు. అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని మాట తప్పిన కాంగ్రెస్ అని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటని తెలిపారు. సమస్యను పరిష్కరించకుండా పోలీసులతో అణగదొక్కాలని చూస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మాజీ సర్పంచుల కుంటుంబాల ఉసురు తగులుతుందన్నారు. అరెస్ట్ చేసిన సర్పంచ్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Ponnam Prabhakar: కులగణన చేయడాన్ని ఎవరు కాదన్నా ఆగదు..