Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాను అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నాతో పాటు అగ్ర నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేయడంతో వల్ల ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారు.. చివరికి కన్న బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులు.. దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఎస్ఐబీ వ్యవస్థను రాష్ట్రంలో భ్రష్టు పట్టించారు.. ఎస్ఐబీని అడ్డు పెట్టుకుని బ్లాక్ మొయిల్ చేసి కాంట్రాక్టర్లు, లీడర్ల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.. కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా?… పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా? అనేది అనుమానమేనని బండి సంజయ్ అన్నారు.
Read Also: Athletes Travel At Train Toilets: అమానవీయ ఘటన.. టాయిలెట్స్ దగ్గర కూర్చుని ప్రయాణించిన అథ్లెట్లు
ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ లాగా సాగదీస్తున్నారే తప్ప చర్యల్లేవు అని బండి సంజయ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సమయంలో ప్రారంభమైన టీవీ సీరియల్స్ ఎపిసోడ్స్ కూడా అయిపోయాయే తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఇంకా సాగుతూనే ఉందన్నారు. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా స్వేచ్ఛ ఇవ్వాలి.. బడా పారిశ్రామిక వేత్తలను, లీడర్లను, వ్యాపారాలను ఫోన్ ట్యాపింగ్ పేరుతో బెదిరించి డబ్బులు చేసిన వ్యవహారంపైనా నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రలను బయట పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
