Bandi Sanjay: అబద్దాలలో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ.. కాంగ్రెస్ పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అటల్ బిహారీ శత జయంతి కార్యక్రమంలో భాగంగా.. అయన చిత్రపటానికి పూలమాలవేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపి లక్ష్మణ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్నికేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ, బండి సంజయ్, లక్ష్మణ్ ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. వాజ్ పేయ్ భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పని చేశారన్నారు.
Read also: CM Revanth Reddy: వచ్చే ఏడాది కూడా మళ్లీ సీఎం హోదాలోనే వస్తా.. మెదక్ చర్చిలో రేవంత్ రెడ్డి
ఒక్క ఓటుతో అధికారం కోల్పోయిన ప్రజాతీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు. రాహుల్ గాంధీకి అంబేద్కర్ పంచ తీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? అని ప్రశ్నించారు. ముందు వాటిని సందర్శించు రాహుల్ గాంధీ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ లో ఉన్న అంబెడ్కర్ విగ్రహం దగ్గరికి రేవంత్ రెడ్డీ వెళ్లి ఎందుకు నివాళులు అర్పించలేదు? అని ప్రశ్నించారు. ఆ విగ్రహం ఎవరు పెట్టారు అనేది కాదు… అది అంబేద్కర్ విగ్రహం కదా? అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్న పార్టీ బీజేపీ అని తెలిపారు. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అబద్దాలలో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని తెలిపారు. బడుగు బలహీనర్గాలు నరేంద్ర మోడీకి మద్దతుగా ఉన్నారన్నారు. సినీ ఇండస్ట్రీ ఆంధ్రకు పోవాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని మండిపడ్డారు.
BJP MP Laxman: అలవికాని హామీలు అమలు చేయలేక డ్రామాలు.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు..