Bandi Sanjay: ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు..
- అబద్దాలలో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు..
- రాహుల్ గాంధీకి అంబేద్కర్ పంచ తీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: అబద్దాలలో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ.. కాంగ్రెస్ పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అటల్ బిహారీ శత జయంతి కార్యక్రమంలో భాగంగా.. అయన చిత్రపటానికి పూలమాలవేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపి లక్ష్మణ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్నికేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ, బండి సంజయ్, లక్ష్మణ్ ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. వాజ్ పేయ్ భారత దేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పని చేశారన్నారు.
Read also: CM Revanth Reddy: వచ్చే ఏడాది కూడా మళ్లీ సీఎం హోదాలోనే వస్తా.. మెదక్ చర్చిలో రేవంత్ రెడ్డి
Also Read
- Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
- Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
- CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
- Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం... 7 రోజులు దాటితే యాక్షన్
ఒక్క ఓటుతో అధికారం కోల్పోయిన ప్రజాతీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు. రాహుల్ గాంధీకి అంబేద్కర్ పంచ తీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? అని ప్రశ్నించారు. ముందు వాటిని సందర్శించు రాహుల్ గాంధీ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ లో ఉన్న అంబెడ్కర్ విగ్రహం దగ్గరికి రేవంత్ రెడ్డీ వెళ్లి ఎందుకు నివాళులు అర్పించలేదు? అని ప్రశ్నించారు. ఆ విగ్రహం ఎవరు పెట్టారు అనేది కాదు… అది అంబేద్కర్ విగ్రహం కదా? అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్న పార్టీ బీజేపీ అని తెలిపారు. అబద్దాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అబద్దాలలో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని తెలిపారు. బడుగు బలహీనర్గాలు నరేంద్ర మోడీకి మద్దతుగా ఉన్నారన్నారు. సినీ ఇండస్ట్రీ ఆంధ్రకు పోవాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని మండిపడ్డారు.
BJP MP Laxman: అలవికాని హామీలు అమలు చేయలేక డ్రామాలు.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?