NTV Telugu Site icon

Bandi Sanjay: 8 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. మోడీ సంకల్పానికి సాక్ష్యం..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పానికి ఈ నిర్ణయం నిదర్శనం. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై బండి సంజయ్ ఎక్స్ వేదికగా శనివారం స్పందించారు. రూ. 24,657 కోట్ల అంచనా వ్యయంతో, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో ఈ కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తారు, ఇందులో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుండి భద్రాచలంలోని పాండురంగాపురం వరకు రూ. 4,109 కోట్లతో 200.60 కి.మీ పొడవున కొత్త లైన్‌ను నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ లైన్ పూర్తి చేసి అందుబాటులోకి వస్తే ఏపీ, తెలంగాణ నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందని స్పష్టం చేశారు.

Read also: CM Revanth Reddy: నగరంలో జోయిటిస్ విస్తరణ.. సీఎం రేవంత్ తో కంపెనీ ప్రతినిధులు భేటీ

ఈ ప్రాజెక్టు వల్ల చాలా రాష్ట్రాలు లబ్ది పొందుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణమ్ తెలిపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర సహా పశ్చిమ బెంగాల్‌లోని 7 రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేసే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.24,657 కోట్లు. 8 ప్రాజెక్టులలో ఒకటి మల్కన్ గిరి-పాండురంగాపురం (భద్రాచలం మీదుగా) 173.61 కి.మీ. ఇది తూర్పు గోదావరి, భద్రాద్రి కొత్తగూడెం మరియు మల్కన్‌గిరి (AP, తెలంగాణ, ఒడిశా) జిల్లాలను కవర్ చేస్తుంది.

Funny Thief in Siddipet: అంబులెన్స్ దొంగలించిన దొంగ.. అరగంటలో యాక్సిడెంట్ ఆసుపత్రికి

Show comments