Site icon NTV Telugu

Hyderabad Crime: నార్సింగ్ లో దారుణం.. 9వ అంతస్తుపై నుంచి కిందపడి యువతి మృతి..

Hyderabad Crime

Hyderabad Crime

Hyderabad Crime: నార్సింగ్ లో దారుణం జరిగింది. మై హోమ్‌ భుజ తొమ్మిదవ అంతస్తు పై నుండి పడి యువతి మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. మృతి చెందిన యువతి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్ గా గుర్తించారు. సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం ఒరిస్సా రాష్ట్రం నుంచి అశ్విత సింగ్ ను రాజేష్ బాబు అనే వ్యక్తి తీసుకువచ్చాడు. పిల్లలను కనివ్వడం కోసం పది లక్షల డీల్ మాట్లాడుకున్నాడు. గత కొన్నాళ్లుగా రాజేష్ బాబు ప్రవర్తన నచ్చక పోవడంతో అశ్విత సింగ్ పారిపోవడానికి ప్రయత్నించింది. తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మై హోమ్ భుజ తొమ్మిదవ అశ్విత సింగ్ అంతస్తు పై నుండి కిందపడి చనిపోయింది.

అశ్విత సింగ్ కు భర్త, నాలుగు సంవత్సరాల బాబు ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అశ్వితాసింగ్ భర్త ఫిర్యాదు తో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి రాజేష్ బాబును అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్‌ బాబు అసభ్యంగా ప్రవర్తించడంతోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చని భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. సరోగసి ప్రాసెస్ మొదలుపెట్టడానికి కోర్టు ఆర్డర్ కోసం రాజేష్ బాబు ఎదురు చూస్తున్నాడని తెలిపారు. రాజేష్ బాబు, అశ్వితాసింగ్ లో మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. గొడవలతో పాటు అశ్వితాసింగ్ చనిపోవడానికి గల కారణాలను విచారిస్తున్నారు.
Narayanpet: పిల్లలు చనిపోతే కానీ స్పందించరా.. మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్..

Exit mobile version