CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి కరచాలనం చేశారు. ఇక, సమావేశాలు ప్రారంభమైన కొద్దీసేటికే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. కాగా, మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేను కేసీఆర్ మాట్లాడుకున్న విషయాలు అక్కడ అడగండి.. అక్కడ అడగాల్సిన విషయాలు ఇక్కడ అడగడం ఎందుకు..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ను కలవడం ఇది రెండో సారి.. మొదటి సారి కాదని సూచించారు. హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా కలిశాను అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: బ్యాటరీ బాంబ్ పేల్చిన Realme.. 10,001mAhతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం..!
అయితే, అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారో ఆయన్నే అడగండి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సభలోని సభ్యులను గౌరవిస్తాం.. పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరి.. మనకు కూడా సెంట్రల్ హాల్ ఉంటుంది.. అందులోకి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ యాక్సెస్ ఉంటుంది.. మాజీ ఎమ్మెల్యేలు కూడా సెంట్రల్ హాల్లోకి వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
Read Also: The Raja Saab : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..ది రాజాసాబ్’ రిలీజ్ ట్రైలర్ అప్‌డేట్.. !
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నీటి వాటాల విషయంలో మంత్రులు అందరూ అలర్టుగా ఉండాలని సూచించారు. సభకు మంత్రుల అటెండెన్స్ మిస్ కావొద్దు.. బీఆర్ఎస్ పార్టీ తమ ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది.. ప్రతిపక్షాలకు కౌంటర్ కు సిద్ధం కావాలని తెలిపారు. జిల్లాల వారీగా మంత్రులు ఆటాకింగ్ కు సిద్ధంగా ఉండాలి.. పాయింట్ అఫ్ ఆర్డర్ ముఖ్యం.. ప్రతిపక్షం అడిగే ప్రతీ అంశానికి సమాధానం ఇవ్వాలని వెల్లడించారు. 4వ తేదీన మళ్ళీ బీఏసీ పెడతామని రేవంత్ రెడ్డి తెలియజేశారు.
