NTV Telugu Site icon

Cyberabad CP: పటాకుల దుకాణం కోసం దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే..

Cyberabad Cp

Cyberabad Cp

Cyberabad CP: దీపావళి పండుగ సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి హెచ్చరికలు జారీ చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేయనున్న పటాకుల దుకాణాలకు తాత్కాలిక లైసెన్స్‌ కోసం ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని పటాకుల వ్యాపారులకు సూచించారు. అనుమతి లేకుండా పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసే వారు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలంలో దుకాణం ఏర్పాటు చేస్తే జీహెచ్‌ఎంసీ అనుమతి పొందాలని తెలిపారు. ప్రైవేట్ స్థలంలో ఉంటే యజమాని నుంచి ఎన్‌ఓసీతో పాటు గతేడాది తీసుకున్న అనుమతి లేఖ తప్పని సరిగి ఉండాలన్నారు. ఏర్పాటు చేయబోయే షాపు బ్లూ ప్రింట్, తదితర రసీదులను నేరుగా సంబంధిత జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో దాఖలు చేయాలని సూచించారు. ఈనెల 24లోపు దరఖాస్తు చేయకుండా టపాసుల షాపులు పెడితే వారిపై కఠిచర్యలు తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు.

Read also: Banjara Hills: పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు.. అదుపులో 100 మంది యువకులు, 42 మంది మహిళలు..

అంతేకాకుండా.. టాపాసులు కొనుగోలు చేసినవారు తగ్గు జాత్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇంటి ముందు టపాసులు కాల్చేటపుడు పిల్లలను గమనించాలన్నారు. పిల్లలు పెద్దల సమక్షంలో మాత్రమే బాణాసంచా కాల్చేలా పెద్దలు పర్యవేక్షించాలన్నారు. ఇంటి ముందు రోడ్డు, వీధుల్లో షూటింగ్‌ చేసేటప్పుడు వాహనాలు, పాదచారులను గమనించాలని తెలిపారు. ఇంటి వరండాలో బట్టలు, ఇతర వస్తువులు మిగిలి ఉంటే ముందుగా వాటిని తొలగించాలని అన్నారు. ఇంటి నుండి బట్టలు కూడా తీసివేయాలన్నారు. బాంబులు పేల్చేటప్పుడు ఇంటి ముందు బకెట్‌లో నీరు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. కాటన్ వస్త్రాలు ధరించడం ఉత్తమం అన్నారు. టపాసులను మీ చేతులతో పట్టుకుని కాల్చవద్దన్నారు. ప్రమాదవశాత్తు పేలుడు గాయం కావచ్చు.. ఇంట్లో లేదా వాకిలిలో బాంబులు పేల్చవద్దన్నారు. వాటి నుంచి వెలువడుతున్న శబ్దం.. పొగ వినికిడి, శ్వాస సమస్యలను కలిగిస్తుందన్నారు. ఇంట్లో వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాలని, బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని సూచించారు.
Jai Hanuman : చేతులు మారిన ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’..?