Pawan Kalyan: హిందీ భాషపై ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. బలవంతంగా.. రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.. అయితే, ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌లో నిర్వహించిన హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొని హిందీ వివస్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. హిందీని ప్రేమిద్దాం.. మనదిగా భావిద్దాం అని వ్యాఖ్యానించారు.. మన దేశం వివిధ సంస్కృతులు ఉంటాయి.. అందరినీ హిందీ ఒక కామన్ భాషగా కలుపుతుందన్నారు.. విదేశస్తులు మన భాష నేర్చుకుంటారు.. మనం హిందీ అంటే ఎందుకు భయపడాలి..? అని ప్రశ్నించారు. హిందీ జబర్దస్త్ వస్తువు ఏమీ కాదు.. జర్మనీ, ఇతర భాషలు నేర్చుకుంటున్నాం.. కానీ, హిందీతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు..
Read Also: Wimbledon 2025: టైటిల్ ఫేవరేట్ సబలెంకకు షాక్.. ఫైనల్ లో అనిసిమోవా..!
హిందీ మనది అనడంలో సిగ్గు ఎందుకు..? హిందీ నీ ప్రేమిద్దాం.. మనదిగా భావిద్దాం అన్నారు పవన్ కల్యాణ్.. బెంగాలీ గీతం జాతీయ గీతం అయింది.. అబ్దుల్ కలాం మిస్సైల్ మన్ అయ్యారు.. దక్షిణ భారత దేశస్తుడు చేసిన జెండా భారత జెండా అయింది.. ప్రతీ భాష జీవ భాష.. రాష్ట్ర భాష హిందీ.. రాష్ట్ర భాష హిందీని స్వాగతిస్తున్నారు.. మాతృ భాష మన అమ్మ భాష అయితే.. పెద్దమ్మ భాష హిందీగా అభివర్ణించారు.. హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమే అవుతుందన్నారు పవన్ కల్యాణ్.. ఉర్దూను, పర్షియన్ ను అంగీకరించి.. హిందీని వ్యతిరేకించడం అవివేకం అవుతుందన్ఆనరు.. 31 శాతం సినిమాలు హిందీ లో డబ్ అవుతున్నాయి.. వ్యాపారానికి హిందీ కావాలి.. కానీ, నేర్చుకోవడానికి అభ్యంతరం ఎందుకు? అని నిలదీశారు పవన్ కల్యాణ్..
