NTV Telugu Site icon

Anchor Shyamala: హైకోర్టులో యాంకర్‌ శ్యామలకు ఊరట.. కానీ..!

Anchor Shyamala

Anchor Shyamala

Anchor Shyamala: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, యాంకర్ శ్యామలకు తెలంగాణ హైకోర్టులో ఊర‌ట దక్కింది.. బెట్టింగ్ యాప్‌ ప్రమోట్ చేసినందుకు ఇటీవల హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో శ్యామలపై కేసు నమోదైన విషయం విదితమే కాగా.. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు శ్యామల.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ క్వాష్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇరువర్గాల వాద‌న‌లు విన్న తర్వాత.. శ్యామలను అరెస్టు చేయవద్దంటూ పోలీసులను ఆదేశించింది.. దీంతో, ఆమెకు బిగ్‌ రిలీఫ్‌ దక్కినట్టు అయ్యింది.. ఇదే సమయంలో.. విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలను ఆదేశించింది హైకోర్టు.. సోమవారం నుండి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.. ఇక, నోటీసు ఇచ్చి విచారణ కొనసాగించవచ్చు అని తెలంగాణ హైకోర్టు పేర్కొంది..

Read Also: IPL 2025: ఈ సీజన్ ఐపీఎల్ అంపైర్లు వీరే.. ఏడుగురు కొత్తవారికి ఛాన్స్