Congress Committees: తెలంగాణలో కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం లభించింది. డీలిమిటేషన్, పీసీసీ క్రమశిక్షణ కమిటీలకు సైతం కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, 22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. ఇంఛార్జ్ , ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో కలపుకొని మొత్తం 22 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే, అడ్వైజరి కమిటీలో ఇంఛార్జీ, సీఎం, పీసీసీ చీఫ్ తో కలిపి 15 మందికి అవకాశం లభించనుంది. డీ లిమిటేషన్ కమిటీలో ఏడుగురి సభ్యులకు అవకాశం ఇవ్వనున్నారు. దీంతో పాటు పీసీసీ క్రమశిక్షణ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులను ఎంపియ చేయనున్నారు.
Read Also: Security Drills: సరిహద్దు రాష్ట్రాల్లో డ్రిల్స్ వాయిదా? మళ్లీ ఎప్పుడంటే..!
అయితే, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబులు, ఇక, అడ్వైజరీ కమిటీలో రేవంత్, జానారెడ్డి, మధుయాష్కీ, గీతారెడ్డిలు ఉండే అవకాశం ఉంది. డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా వంశీ చందర్ రెడ్డి ఎంపిక చేశారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవి, 16 మందితో ఏర్పాటయ్యే సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ గా పి. వినయ్ కుమార్‌లను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
