NTV Telugu Site icon

MLC Kavitha: కవిత లిక్కర్ సీబిఐ కేసు.. ఆగస్టు 7కు వాయిదా వేసిన కోర్టు..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: లిక్కర్ సీబిఐ కేసులో కవిత డిఫాల్ట్ బెయిల్ పై రౌస్ ఏవిన్యూ కోర్టులో విచారణ జరిపింది. ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బావేజా విచారణ జరిపారు. అయితే విచారణ అనంతరం తదుపరి విచారణ ఆగస్టు 7 కు వాయిదా వేసింది. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై వాదనలకు కవిత తరపు న్యాయవాది వాయిదా కోరారు. సీనియర్ అడ్వకేట్స్ అందుబాటులో లేరని కవిత తరపు న్యాయవాది చెప్పారు. నితీష్ రాణా, మోహిత్ రావులు రాలేదా జడ్డి అడిగారు.

Read also: Devara: సాయంత్రం సంచలనం సృష్టించబోతున్న దేవర.. మీరు రెడీనా..?

రాలేదని కవిత తరుపున న్యాయవాది చెప్పడంతో.. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై వాదనలకు చివరి సారిగా వాయిదా వేస్తున్నా అని జడ్జి కావేరి బవేజా తెలిపారు. వాదనలు వినిపించక పోతే, పిటిషన్ ను విత్ డ్రా చేసుకొవాలని కోరారు. దీంతో దీనిపై ఆగస్టు 7కు వాయిదా పడింది. మరోవైపు ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కవితకు బీఆర్ఎస్ నేతలు ధైర్యం చెప్పనున్నారు. రేపు తీహార్ జైలులో ఉన్న కవితను కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కలవనున్నారు.
Gold Price Today: మగువలకు శుభవార్త.. వరుసగా రెండో రోజు..!