NTV Telugu Site icon

ACB Raids: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ దాడులు..

Acb Raids

Acb Raids

ACB Raids: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో కుళ్లిపోయిన పదార్థాలతో భోజనం వండుతున్నారనే ఆరోపణలున్నాయి. అదేవిధంగా గత కొన్ని రోజులుగా హాస్టళ్లలోని విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని బాలుర గురుకుల పాఠశాలలో తీవ్ర కడుపునొప్పితో విద్యార్థి మృతి చెందిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో మంగళవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హాస్టళ్లలో ఆహారంతోపాటు సౌకర్యాలపై ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహంలో మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హాస్టల్‌లో విద్యార్థులకు అందజేస్తున్న ప్రభుత్వ ప్రయోజనాలను పరిశీలించారు. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించడం లేదన్న ఫిర్యాదులపై కొంతకాలంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Read also: Rebal Star: కల్కి సినిమా ఇంకా చూడలేదా..? అయితే ఇక్కడ చూసేయండి..

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. గురుకులాలు, హాస్టళ్లలో సోదాలు చేస్తున్న ఏసీబీ. మెస్, స్టూడెంట్స్ రిజిస్టర్ లను స్వాధీనం చేసుకున్నారు. రికార్డులన్నింటిని క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తున్నారు. పలు హాస్టల్ స్టూడెంట్స్ రిజిస్టర్ లలో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నట్టు వార్డెన్ లు నమోదు చేశారు. ఎక్కువ మంది ఉన్నట్టు చూపి అధిక మెస్ బిల్లులు తీసుకుంటున్నట్టు చేస్తున్నట్టు గుర్తించారు. కొంతమంది హాస్టల్ సిబ్బందిని అదుపులోకి తిసుకుని విచారిస్తున్నారు.

Read also: Thummala Nageswara Rao: నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఇవే..

రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎస్పీ ఉదయ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణం పెద్దూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు.. ర్యాండం సిస్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేపట్టారు. హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయని అధ్యయనం చేస్తున్నారు.
Revanth Reddy: నేటితో ముగియనున్న సీఎం విదేశీ పర్యటన.. రేపు హైదరాబాద్‌ కు రేవంత్‌ రెడ్డి