NTV Telugu Site icon

Hyderabad: మద్యం మత్తులో యువతుల హల్చల్.. బైక్ను ఢీ కొట్టిన కారు..

Hyd

Hyd

Hyderabad: హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో మద్యం మత్తులో కారు బీభత్సం సృష్టించింది. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ దగ్గర ద్విచక్ర వాహన దారుని ఢీకొట్టిన కారు.. దీంతో పాటు మద్యం మత్తులో యువతులు హల్ చల్ చేశారు. బైక్ ను ఢీ కొట్టడమే కాక సదరు వాహనదారిని యువతులు బెదిరించారు. దీంతో ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులు ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్టు తేలింది. మద్యం సేవించినట్టు తెలిపిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.