NTV Telugu Site icon

Road Accident: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు.. 5 గురు మృతి, పలువురికి గాయాలు.

A Series Of Road Accidents In Telanga

A Series Of Road Accidents In Telanga

Road Accident: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5 మంది మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.

పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన కూలీపని చేసే వెంకటేష్ (34) పనిమీద ఇదే గ్రామానికి చెందిన రమేష్, మల్లేష్ లను బైక్ పై ఎక్కించుకొని ఇస్నాపూర్ కు వచ్చి తిరిగి గ్రామానికి వెళుతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ చౌరస్తాలో జాతీయ రహదారి దాటుతుండగా పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే లారీ వెనుకనుంచి వచ్చి బైకును ఢీ కొట్టింది. దీనితో ముగ్గురు కిందపడిపోగా వెంకటేష్ కు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. రమేష్ ను తొలుత పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తలరించారు. అయితే ప్రథమచికిత్సకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతిచెందాడు. ఇక మల్లేష్ కు స్వల్పగాయాలయ్యాయి. మృతుల ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Powerful Dance: నడి రోడ్డుపై డాన్స్ చేసిన హీరోయిన్.. వీడియో వైరల్..

వికారాబాద్ జిల్లా యాలాల మండలం చెన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. లక్ష్మణ్ అనే వ్యక్తి పూజా సామాగ్రిని చెరువులో వదిలేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగి మృతి చెందాడు. పది రోజుల క్రితం లక్ష్మణ్ పెదనాన్న కొడుకు మృతి చెందగా.. దశదినకర్మ కార్యక్రమం ముగిసిన తర్వాత పూజా సామాగ్రిని చెరువులో వదిలేందుకు లక్ష్మణ్ వెళ్లాడు. కాలుజారి నీటిలో మునిగడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు కాపాడుకొనేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.. చివరకు ప్రాణాలు వదిలాడు. స్ధానిక సమాచారంతో ఘటనాస్థలికి చెందిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నాచారం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నాచారం హెచ్ఎంటి నగర్ వద్ద స్కూట్ పై వెళుతున్న యువతిని గ్యాస్ లారి ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడిక్కడే మృతి చెందింది. స్థానిక సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది.

మేడ్చల్ న్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాక్టివా వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుండి రెడీమిక్స్ వాహనం ఢీ కొట్టింది. భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. మేడ్చల్ పట్టణంలోని కేఎల్ ఆర్ వెంచర్ లో నివాసం ఉంటున్న రత్నం(55), మాధవరావుగా గుర్తించారు పోలీసులు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై ఘటన జరిగింది.
Tank Bund Updates: ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..

Show comments