Site icon NTV Telugu

Hyderabad: దుర్గం చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య..

Suicide

Suicide

హైదరాబాద్ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని దుర్గం చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నంబూరి చాణిక్య వర్మగా గుర్తించారు. నంబూరి చాణిక్య వర్మ (24) మాదాపూర్ లోని చందా నాయక్ తండ వాసిగా గుర్తించారు. కాగా.. చాణక్య వర్మ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేసేవాడు.. మొన్న తన రూమ్ నుండి వెళ్లిన చాణక్య వర్మ ఇంటికి రాకపోయేసరికి అతనికి తెలిసిన వారి వద్ద అతని రూమ్ మెంట్స్ ఆరా తీశారు.

Read Also: YS Jagan: ఏపీలో ముఠాల పాలన కనిపిస్తుంది..

ఆచూకీ తెలవకపోవడంతో చాణక్య రూమ్ మెంట్స్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడు చాణుక్యవర్మ విజయనగరానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు మాదాపూర్ పోలీసులు. ఆర్థిక ఇబ్బందుల వలన ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: Bangladesh clashes: బంగ్లాదేశ్ ఘర్షణల్లో 32 మంది మృతి.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..

Exit mobile version