NTV Telugu Site icon

Yadadri Bhuvanagiri: బీర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. ఎగబడ్డ మందుబాబులు..

Yadadri Bhuvanagiri

Yadadri Bhuvanagiri

Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారం స్టేజీ సమీపంలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఆగి ఉంది. ఈ క్రమంలో మరో లారీ వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ రెండు లారీల్లో ఒకటి ఉల్లిపాయలు… మరొకటి బీర్లు లోడు. ఈ ప్రమాదం కారణంగా రెండు ట్రక్కుల సరుకు రోడ్డుపై పడిపోయింది. బీరు బాటిళ్లు, ఉల్లిపాయలు రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో వాటిని తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ఇక మందు బాబులు బీరు సీసాలు తెచ్చుకునేందుకు రోడ్డంతా నిండిపోయారు.

Read also: CM Revanth Reddy: నేడు రంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

ఈ క్రమంలో ఆ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మృతదేహాన్ని వెలికితీశారు. ట్రాఫిక్‌ జామ్‌ను తొలగించే ప్రయత్నం చేశారు. మొత్తానికి వివిధ రకాల సరుకులు తీసుకెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురై చాలా మంది గాయాలపాలవుతున్నారు. ఒక్కోసారి పెట్రోల్, డీజిల్ కోసం తీసుకుని వెళ్లేందుకు వెళ్లిన స్థానికులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. గతంలో ఓ ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో స్థానికులు అందులో ఉన్న పెట్రోల్‌ను తీసుకెళ్లేందుకు ఎగిరిపడ్డారు. ఈ క్రమంలో అక్కడ మంటలు చెలరేగి..దాదాపు 150 మంది చనిపోయారు. అదేవిధంగా మరో ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది సహాయం చేయడం మానేసి సరుకుల కోసం ఎగడబడటం మరికొందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదిఏమైనా బీర్లు మాత్రం రోడ్డు పై పడటంతో మందుబాబులు ఎగబడ్డారు.
CM Chandrababu: నేడు శ్రీశైలం, సత్యసాయి జిల్లాలో సీఎం పర్యటన..