NTV Telugu Site icon

Harassment: కాలం ఎటుపోతుంది.. రెండో తరగతి చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అసభ్య ప్రవర్తన..

Harassment

Harassment

Harassment: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం అనివార్యంగా మారింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఉంటోంది. స్మార్ట్ ఫోన్ లేకుంటే రోజు గడవని పరిస్థితి నెలకొంది. అలా సెల్ ఫోన్ శరీరంలో ఓ భాగమైపోయింది. కోవిడ్ తర్వాత సెల్ ఫోన్ చిన్నారులకు కూడా అత్యవసర వస్తువుగా మారింది. సెల్‌ఫోన్‌తో చిన్నారులకు కొంత మంచి జరిగితే.. మరికొందరికి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో పిల్లలపై స్మార్ట్‌ఫోన్‌లు ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. మొబైల్ ఫోనే అన్ని ప్రమాదాలకు కారణం అవుతుంది. వాటిలో కొన్ని అసభ్యకర వీడియోల కారణంగానే ఇలా జరుగుతోంది. పిల్లల చేతిలో మొబైల్ ఫోన్లు ఉండడంతో కొన్ని వీడియోలు వారిపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఆ వీడియోలు చిన్నప్పటి నుంచి ప్రభావితం చేస్తూ యువతను నాశనం చేస్తున్నాయి. దీనివల్ల కొందరు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన హైదరాబాద్ ఉప్పల్ లోని ఓ ప్రముఖ స్కూల్ లో సంచలనంగా మారింది.

Read also: West Bengal : 14 గంటల విచారణ… ఆపై అరెస్ట్, రేషన్ పంపిణీ కుంభకోణంలో టీఎంసీ నేతపై ఈడీ యాక్షన్

చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉప్పల్ ప్రముఖ స్కూల్ లో కలకలం రేపింది. రెండో తరగతి చిన్నారిపై 9 తరగతి విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు. చిన్నారితో వికృతి చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో చిన్నారి తమ తల్లిదండ్రలతో విషయం చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యం స్పందించాలని ధర్నా చేశారు. చిన్నారిపై లైంగిక వేధింపులు ఏంటని? ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ వెంటనే స్పందిచకపోతే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. దీంతో స్కూల్ మేనేజ్మెంట్ స్పందించి 9వ తరగతి విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించారు. స్కూల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. పిల్లలకు సెల్ ఫోన్ లు చేతిలో ఇవ్వకూడదని అన్నారు. విద్యా భుద్దులు నేర్పకుండా తల్లిదండ్రుల పనులకు ఆటంకం చేస్తున్నారంటూ.. వారికి సెల్ ఫోన్ ఇచ్చి పక్కన కూర్చొబెట్టడం అందరికి అలవాటు మారిందన్నారు. ఇప్పటికైనా పిల్లలకు సెల్ ఫోన్ కు దూరంగా ఉంచాలని సూచించారు.
CM Chandrababu: ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ.. ఎంతో సంతృప్తిని ఇచ్చింది..

Show comments