Ganja Batch : తెలుగు రాష్ట్రాల్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. అర్ధరాత్రి నడిరోడ్డుపైనా అరాచకాలు సృష్టిస్తోంది. దాడులు చేయడం.. వీలైతే మర్డర్లు చేయడం గంజాయి బ్యాచ్‌కు పరిపాటిగా మారింది. మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని విధంగా నేరాలు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ అటు విజయవాడలో జరిగిన రెండు ఘటనలు గంజాయి బ్యాచ్ ఆగడాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మహ్మద్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తిని గంజాయి గ్యాంగ్ కత్తులతో పొడిచి చంపేసింది. చాంద్రాయణగుట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో అతన్ని దారుణంగా హత్య చేశారు. గొంతుపై చాకుతో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి…
HYD ROHINGYA : పాతబస్తీ గడ్డ.. రోహింగ్యాల అడ్డా
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు మృతుని తండ్రి నుంచి వివరాలు సేకరించారు. అజీజ్.. తన భార్యను కలిసి వచ్చేందుకు వెళ్లినట్లు ఆయన చెబుతున్నారు. కానీ తిరిగి రాలేదని చెప్పారు. ఇది కచ్చితంగా గంజాయి బ్యాచ్ పనే అయి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గతంలో అజీజ్ కూడా గంజాయి బ్యాచ్‌తో తిరిగినట్లు వెల్లడించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయి.
అర్ధరాత్రి పూట గంజాయి బ్యాచ్ ఆగడాలు ఆగడం లేదు. విజయవాడలో నిన్న ఆర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. కంట్రోల్ రూమ్ ఫ్లై ఓవర్, దుర్గగుడి ఫ్లైఓవర్ మీదే ఓ వ్యక్తిపై దాడికి తెగబడింది. ఈ ఘటనను ఇంకా వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఐతే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కూతవేటు దూరంలోనే ఘటన జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి… గణేష్ అనే యువకుడిపై గంజాయి బ్యాచ్ దాడి చేసినట్లుగా వీడియోల ద్వారా తెలుస్తోంది. ఐతే ఈ వీడియో ఆధారంగా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు..
Shubman Gill: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. టీమిండియా తొలి కెప్టెన్‌గా..!
