NTV Telugu Site icon

Hyderabad Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ మారుతున్నాయ్.. పట్టుబడ్డారో ముక్కుపిండి వసూలు చేస్తారు

Hyderabad Trafic Ruls

Hyderabad Trafic Ruls

Hyderabad Traffic Rules: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి.. రూల్స్ అన్నీ మారిపోతున్నాయి. ఇక.. హైదరాబాద్ ట్రాఫిక్ పై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం అవసరమైతే ట్రాఫిక్ రూల్స్ మార్చేందుకు కూడా వెనుకాడవద్దని ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. దీంతో హైదరాబాద్ సీపీ, ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగారు.

Read also: Bird Flu : ఆంధ్ర ప్రదేశ్ లోకి బర్డ్ ఫ్లూ ఎంట్రీ.. ఈ జిల్లాలో చికెన్ అమ్మకం నిషేధం

హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ పై భాగ్యనగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

కీలక ఉత్తర్వులు జారీ చేశారని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీపీ మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి నిరంతర ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని పార్కింగ్‌ను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించకుంటే చలాన్‌ జారీ చేసి జరిమానాలు వసూలు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ వదిలిపెట్టరు. గూడ్స్ వాహనాలతో రద్దీ పెరుగుతుందని.. నిర్ణీత సమయంలో మాత్రమే నగరం లోపలికి రావాలని సూచించారు. ఇతర సమయాల్లో వస్తే చలాన్లు జారీ చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్‌పై కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నామని.. హైదరాబాద్ ట్రాఫిక్ లెస్ సిటీగా మారుతుందని చెప్పారు.

Read also: Astrology: ఫిబ్రవరి 18, ఆదివారం దినఫలాలు

ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ మాసాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 150 కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాలకు 35 వేల మంది హాజరయ్యారని తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళితే క్షేమంగా తిరిగి వెళ్లాలని అన్నారు. అతిగా వాహనాలు నడపరాదని, కుటుంబ సభ్యులకు దుఃఖం మిగిల్చొద్దన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్‌ పేరును కాపాడుకుందాం అన్నారు. ట్రాఫిక్‌ జీవితమంటూ నిత్యం ఇబ్బందులు పడుతున్నామని పోలీసులు తెలిపారు. ఒకరి తప్పిదం వల్ల ట్రాఫిక్‌ వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారని అన్నారు. హైదరాబాద్ రోడ్లపై వాహనాలు సాఫీగా వెళ్లాలని సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి సూచించారు.
Gold Rate Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?