NTV Telugu Site icon

New Traffic Rules: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌.. ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ

Joint Cp Ranganath

Joint Cp Ranganath

హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ అమల్లోకి రాబోతున్నాయి.. ఇక, ఏద పొరపాటు చేసినా.. జేబుకు చిల్లు పడడం ఖాయం.. నగరంలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు… రాంగ్ సైడ్ రైడింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్‌ ధరించకపోవడం.. ఇలా ఏది చేసినా జరిమానా తప్పదు.. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు 1700 రుపాయాలు, ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1200 రుపాయలు.. ఇలా ఫైన్‌ వేయబోతున్నారు.. ఈ నెల 28 నుంచి రాంగ్‌సైడ్, ట్రిపుల్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టబోతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇదే సమయంలో.. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా సాగుతోంది.. దీంతో, కొత్త రూల్స్ పై ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు..

Read Also: Dasyam Vinay Bhaskar: దేశ ప్రజలందరిచూపు కేసీఆర్ వైపు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధం..!

రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌పై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న తీరుపై వివరణ ఇస్తున్నాం.. ఇవి కొత్తగా వచ్చిన రూల్స్ కావు అన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్.. గతంలో ఛలాన్లతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని గమనించి డిస్కౌంట్లు ఇచ్చామని గుర్తుచేసిన ఆయన.. టూ వీలర్ వాహనదారులకు గతంలో కంటే ఇప్పుడు ఛలాన్లను తగ్గించామన్నారు.. కానీ, కార్లు, హెవీ వెహికిల్స్ కు ఛలానాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కార్లు, హెవీ వెహికల్స్‌తో ప్రమాదం జరిగితే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఆయన.. రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌లతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.. అందుకే సీరియస్ గా తీసుకున్నామని స్పష్టం చేశారు.. వాహనదారుల్లో డిసిప్లేన్ రావడానికి మాత్రమే ఈ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని తెలిపారు.

ఛలాన్లతో ప్రభుత్వానికి బడ్జెట్ వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు జాయింట్‌ సీపీ రంగనాథ్.. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగేవారిపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన ఆయన.. టెంపర్వరీ నెంబర్ కేవలం నెలరోజుల వరకే ఉంటుందని.. ఆ తర్వాత ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ బిగించుకోవాల్సిందే.. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలు నేరాలకు పాల్పడి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక, హైదరాబాద్‌ మహా నగరంలో 2014లో 41 లక్షల వాహనాలు ఉంటే.. ఇప్పుడు 81 లక్షల వరకు వాహనాలు పెరిగాయని వివరించారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. కాగా, ట్రాఫిక్‌ నిబంధనల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించబోతున్నారు హైదరాబాద్‌ పోలీసులు.. ఇప్పటికే సిగ్నల్స్‌ దగ్గర.. బోర్డర్‌ దాటకుండా చర్యలు చేపట్టిన పోలీసులు.. అందులా చాలా వరకు విజయం సాధించారు.. వాహనదారుల్లో అవగాహన పెంచుతున్నారు.. ఇక, ఇప్పుడు రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్, ట్రిఫుల్‌ రైడింగ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు.. దీని కోసం ఈ నెల 28వ తేదీ నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించబోతున్నారు.