Site icon NTV Telugu

Traffic Challan’s: 650 కోట్ల విలువైన చలాన్స్ క్లియర్.. మరింత కఠినంగా రూల్స్..!

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్స్‌ క్లియర్స్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌కు భారీగా స్పందన వస్తుంది.. ఇప్పటికే రూ.190 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు డబ్బులు వచ్చి చేరాయి… ట్రాఫిక్‌ చలాన్స్‌ క్లియరెన్స్‌ మరియు ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసేవారిపై వ్యవహించనున్నతీరుపై మీడియాతో మాట్లాడిన ట్రాఫిక్‌ జాయింట్ సీపీ రంగనాథ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. 4 రోజులో డిస్కౌంట్‌ ఆఫర్‌కు భారీ స్పందన వచ్చిందన్న ఆయన.. మూడు కమిషనరేట్ల పరిధిలో అనూహ్య స్పందన వచ్చింది… 650 కోట్లకు పైగా విలువైన చలాన్స్ క్లియర్ అయ్యాయి… ఇందులో రాయితీ పొగ రూ.190 కోట్లు ఖజానాకు వచ్చి చేరాయన్నారు.. ఇక, కోటి ఎనబై ఐదు లక్షల చాలన్లు క్లియర్ అయ్యాయని.. రోజుకు ఏడు నుండి పది లక్షల చలాన్లు క్లియర్ అవుతున్నాయని.. మార్చి 31వ తేదీ వరకు అవకాశం ఉంటుందని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. మళ్లీ తేదీని పొడిగించే ఆలోచన లేదని స్పష్టం చేసిన ఆయన.. టార్గెట్ పెట్టుకుని చలాన్ల వసూలు చేయాలన్న ఆలోచన లేదన్నారు.. 15 వందల కోట్ల విలువ చేసే చలాన్ల పెండింగ్ ఉన్నాయి.. 60 నుండి 70 శాతం క్లియర్ అవుతాయని ఆశిస్తున్నామని తెలిపారు.

Read Also: VH: సోనియా గాంధీకి అభినందనలు.. ఇది శుభసూచకం..

ఇక, గడువు సమయం తర్వాత ట్రాఫిక్ రూల్స్ వయిలెట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు రంగనాథ్.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ సంఖ్య చాలన్లు క్లియర్ అయ్యాయన్న ఆయన.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినవారిపై ఛార్జ్‌షీట్‌లు వేస్తామని.. ఏప్రిల్ నుండి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఛార్జ్‌షీట్‌ తప్పదని హెచ్చరించారు.. కోవిడ్ కారణాలతో గ్యాప్ ఇచ్చాం.. తిరిగి మునుపటి లాగే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతామన్న ఆయన.. అద్దాలపై స్థాయిని మెన్షన్ చేస్తూ స్టిక్కర్స్ వేసుకోవద్దు అని సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ ఉన్నాయన్నారు.. నిబంధనలకు విరుద్ధంగా స్టిక్కర్స్ వేసుకుని తిరిగితే చర్యలు తీసుకుంటామని.. ప్రత్యేక సమయాల్లో తామే స్టిక్కర్స్‌ ఇస్తామని వెల్లడించారు.. గతంలో తాము ఇచ్చిన స్టిక్కర్స్ గడువు ముగిసిన అలానే వాడుతున్నారన్న ఆయన.. వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. 177 మోటార్ వెయికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.. నగర వ్యాప్తంగా స్పీడ్ లిమిట్ ఒకే రకంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతా లాంటి నగరాల్లో స్పీడ్ లిమిట్ పై అధ్యయనం చేశామని.. త్వరలో స్పీడ్ లిమిట్ విధానం అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు.. డివైడర్ల వద్ద స్పీడ్ అంచనా వేసి పరికరాలు అమరుస్తాం.. వాటి ఆధారంగా అతి వేగంగా వెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు ఉంటాయి. తాగి వాహనం నడిపే వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు ట్రాఫిక్‌ జాయింట్ సీపీ రంగనాథ్.

Exit mobile version