Montha Effect : హైదరాబాద్- శ్రీశైలం రాకపోకలు బంద్..
- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో డిండి ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద ప్రవాహం
- దుందుభి నది ఉధృతికి డిండి అలుగు బ్రిడ్జ్ దెబ్బతినడంతో రాకపోకలు నిలిపివేత
- హైదరాబాద్–శ్రీశైలం హైవేపై వాహనాల రాకపోకలకు తాత్కాలిక ఆంక్షలు
- ప్రాజెక్ట్ వద్ద భద్రతా చర్యలు బలోపేతం చేసిన పోలీసులు, ప్రజలకు అప్రమత్తత సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Montha Effect : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని డిండి ప్రాజెక్ట్ వద్ద వరద ఉధృతి పెరిగింది. డిండి ప్రాజెక్ట్‌కు దుందుభి నది నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రవాహం అంతలా పెరగడంతో నది ప్రాజెక్ట్ సమీపంలోని అలుగు బ్రిడ్జిని తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. తీవ్ర ప్రవాహం కారణంగా డిండి అలుగు బ్రిడ్జ్‌లో కొంత భాగం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-శ్రీశైలం హైవేపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రస్తుతం అచ్చంపేట, హైదరాబాద్, శ్రీశైలం మార్గాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఆ మార్గంలో ప్రయాణించవద్దని అధికారులు సూచించారు. ప్రాజెక్ట్ పరిసరాల్లో పోలీసులు భద్రతా చర్యలను బలోపేతం చేశారు. రహదారి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నారు.
Also Read
డిండి ప్రాజెక్ట్ వద్ద నీటి ప్రవాహం ఇంకా పెరుగుతున్నందున, పరిస్థితిని జిల్లా యంత్రాంగం క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే గంటల్లో నాగర్‌కర్నూల్, నల్లగొండ, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులు ప్రజలను జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు.
Cyclone Montha: మరో 48 గంటలు జాగ్రత్త.. జిల్లా కలెక్టర్లకు మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!