HYD ROHINGYA : హైదరాబాద్‌లో ఉన్న రోహింగ్యాలు ఎంత మంది? ఈ ప్రశ్నకు ఎవరి దగ్గరా సరైన ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రోహింగ్యాలు స్థానికంగా ఉన్న గుర్తింపు కార్డులు పొంది మనలో కలిసిపోయారు. పైగా తామే లోకల్ అంటూ కాలర్ ఎగిరేసి మరీ చెప్పుకుంటున్నారు. ఇంకా కొంత మంది రోహింగ్యాలైతే క్రైమ్స్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. వీరి వల్ల జాతీయ భద్రతే ప్రమాదంలో పడింది. యస్.. మీరు విన్నది కరెక్టే…!! బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి పది మంది కాదు.. వందల మంది కాదు.. వేల మంది వచ్చి హైదరాబాద్ పాతబస్తీలో పాగా వేశారు..
ఓల్డ్ సిటీలో వీరు ఉంటున్న కొన్ని ప్రాంతాల్లో అరాచకం రాజ్యమేలుతోందంటే అతిశయోక్తి కాదు. ఎక్కడి నుంచో వచ్చిన ఈ రోహింగ్యాలకు ఇక్కడ గుర్తింపు కార్డులు కూడా ఉన్నాయంటే.. వారు ఎంతలా హైదరాబాద్ నడిబొడ్డులో పాతుకుపోయారో అర్ధమవుతోంది.. నిజానికి వీరంతా అక్రమంగా వచ్చినవారే. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులు హైదరాబాద్‌లోని బాలాపూర్, బహదుర్‌పురా, ఫలక్‌నుమా, చింతల్‌బస్తీ వంటి ప్రాంతాల్లో పాగా వేశారు. భారత ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, అస్సాం మీదుగా రైలు లేదా బస్సుల్లో ప్రయాణించి ఇక్కడికి వచ్చేశారు. ప్రస్తుతం ఓల్డ్ సిటీలో 1200 కుటుంబాలు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
Shubman Gill: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. టీమిండియా తొలి కెప్టెన్‌గా..!
కానీ అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు 40వేలకు పైగా రోహింగ్యా కుటుంబాలు ఇక్కడ అక్రమంగా ఉంటున్నాయనే అంచనాలు ఉన్నాయి. అంటే దాదాపు లక్ష మంది వరకు పాతబస్తీలో పాగా వేసినట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5,000 రోహింగ్యాలు, 10,000 బంగ్లాదేశీయులు ఉన్నట్టు అంచనా..
ముఖ్యంగా పాతబస్తీలోని చాంద్రాయణ గుట్ట, బాలాపూర్, ఆషామాబాద్, కాలా పత్తర్, ఫలక్ నుమా, బార్కాస్, షాహిన్ నగర్ వంటి ప్రాంతాల్లో వీళ్లు ప్రముఖంగా ఉన్నారు. మన దేశానికి చెందిన వారైతే ఎక్కువ డబ్బులకు పనిచేస్తారు. వీళ్లు మాత్రం ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అందుకే పలు రకాల పనుల కోసం.. తక్కువ జీతానికి వీరిని పిలిపిస్తున్నారు. ఇలా పనిచేస్తున్న వారిలో స్లీపర్స్ సెల్స్ కూడా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి…
మొత్తానికి ఏదో రకంగా హైదరాబాద్ చేరుకున్న రోహింగ్యాలు.. స్థానికుల సహకారంతో తప్పుడు జనన ధ్రువపత్రాలు, ఆధార్, పాన్ కార్డులు సైతం తీసుకున్నారు. వాటి ఆధారంగా పాస్‌పోర్టులు కూడా పొందుతున్నారు. ఇక ఇలాంటి గుర్తింపు కార్డులు వచ్చిన తర్వాత వారి అరాచకం షురూ చేశారు. ఈ గుర్తింపుల ఆధారంగా విదేశాలకు వెళ్లడం, డ్రగ్స్ రవాణా, వ్యభిచారం, రౌడీ గ్యాంగ్‌లలో చేరడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు… స్పాట్..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రంజాన్ షేక్ అనే బంగ్లాదేశీయుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పోచారంలో నివసిస్తున్న మరో నిందితుడు పశ్చిమ బెంగాల్‌లో తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసుకున్నట్టు బయటపడింది. ఈ రోహింగ్యాలలో కొంత మందికి UNCHR అధికారికంగా శరణార్థి సర్టిఫికెట్ల జారీ చేసింది. వాటిని అడ్డం పెట్టుకుని కూడా ఇక్కడ అరాచకాలు సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్‌లో శరణార్థుల చట్టవిరుద్ధ దందాలు స్థానిక జనాభా భద్రతకు ముప్పుగా మారుతున్నాయి…
నిజానికి ఈ రోహింగ్యాలు చేస్తున్న అరాచకాలు భరించలేక మయన్మార్ నుంచి వారిని అక్కడి సర్కారు తరిమేసింది. దీంతో వెస్ట్ బెంగాల్, అసోం ద్వారా హైదరాబాద్ చేరుకుని ఇక్కడ అరాచకాలు స్టార్ట్ చేశారు. అందుకే భారత ప్రభుత్వం అక్రమంగా భారత్‌లో స్థిర నివాసం ఉంటున్న వారిపై కఠినంగా వ్యవహరించడంతో వారి దేశాలకు డిపోర్ట్ చేసే పనిలో పడింది..
Pawan Kalyan : ఛీ..ఛీ.. అంటూ పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. జనసేన కౌంటర్..
