RRR Rail Project : హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.!
- హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్‌కు కేంద్రం ప్రాథమిక ఆమోదం
- సర్వే, డీపీఆర్ సిద్ధానికి రైల్వే శాఖ అనుమతి
- తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్న అధికారులు
- ప్రాజెక్టు అమలుకు ఇంకా దాటాల్సిన కీలక దశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Regional Ring Rail Project : హైదరాబాద్ మహానగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల రీజినల్ రింగ్ రైల్ (RRR) ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించేందుకు , సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేసేందుకు కేంద్ర రైల్వే శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది.
Director Shankar: శంకర్’కి తొలగని తలనొప్పులు..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ప్రస్తుతం ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (RRR) వెంబడే ఈ రైలు మార్గం అలైన్‌మెంట్‌ను రూపొందించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు భూసేకరణ, సాంకేతిక అంశాలు , మార్గాల ఎంపికపై రైల్వే శాఖ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న జిల్లాలను అనుసంధానిస్తూ సాగే ఈ రైలు మార్గం, భవిష్యత్తులో శివారు ప్రాంతాల అభివృద్ధికి , రవాణా సౌలభ్యానికి వెన్నెముకగా నిలవనుంది.
అయితే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి మరికొన్ని కీలక దశలు దాటాల్సి ఉంది. సర్వే అనంతరం సిద్ధమయ్యే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఆధారంగానే ప్రాజెక్టుకు తుది ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాత నీతి ఆయోగ్ , కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తి కావాల్సి ఉన్నందున, ప్రాజెక్ట్ అమలుకు సంబంధించి ఖచ్చితమైన టైమ్‌లైన్‌ను ఇప్పుడే చెప్పలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్థిక లభ్యత, సాంకేతిక సవాళ్లు , క్షేత్రస్థాయి పరిస్థితులపైనే ప్రాజెక్ట్ గడువు ఆధారపడి ఉంటుందని రైల్వే శాఖ వివరించింది.
Allu Cinemas: శర్వా బైకర్ సినిమాను ఒక్క దెబ్బకి లేపిన అల్లు సినిమాస్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!