HYDRA : నగరంలో సోమవారం భారీ వర్షం కురిసింది. గంట వ్యవధిలో 7 నుంచి 8 సెంటీమీటర్ల వరకూ వర్షపాతం నమోదైంది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షం పడే అవకాశాలను రెండు గంటల ముందుగానే గ్రహించిన హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలిస్తున్న సమయంలోనే భారీ వర్షం కురవడంతో హైడ్రా కమిషనర్ నేరుగా వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. లకడికాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో ఉన్న డీఆర్ ఎఫ్ సిబ్బందితో పాటు.. హైడ్రా మాన్సూన్ ఎమర్జన్సీ బృందాలతో మాట్లాడి వరద ముప్పు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
Ajith Kumar : ఘోరంగా అవమానించారు.. అజిత్ ఎమోషనల్ నోట్
కొన్ని చోట్ల చెట్లు విరిగి పడగా.. సిబ్బంది వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. మరికోన్న చోట్ల వరదకు చిక్కకున్న కార్లను పక్కకు తొలగించి.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. జూబ్లీహిల్స్, జీడిమెట్ల, ఉప్పల్ ఇలా అన్ని ప్రాంతాల్లో జీహెచ్ ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయంగా పని చేసి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా చూశారు. రోడ్డు అండర్ బ్రిడ్జిల వద్ద ఆటోమేటిక్ డీవాటర్ పంపులకు తోడుగా హైడ్రా నీటి పంపులను కూడా ఉంచి.. వరద ముప్పు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎక్కడైనా వరద ముప్పు ఉన్నట్లయితే రౌండ్‌ది క్లాక్ పని చేసే హైడ్రా కంట్రోల్ రూమ్ (9000113667)కి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Uttam Kumar Reddy : ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే కాళేశ్వరంపై కమిషన్ వేశాం
