Hyderabad Rains : హైదరాబాద్‌లో సెప్టెంబర్ 17న కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరం తడిసి ముద్దయింది. సాయంత్రం మొదలైన వర్షం రాత్రి 9 గంటల తర్వాత కూడా గంటపాటు విడవకుండా కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడి, రాత్రి 10 గంటలకు కూడా వాహనదారులు తమ ఇళ్లకు చేరుకోలేకపోయారు. వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరికల ప్రకారం, హైదరాబాద్‌లో మరో రెండు గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయి. అర్ధరాత్రి వరకు వర్ష సూచన ఉంది. ఇప్పటికే వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. GHMC మరియు హైడ్రా మాన్సూన్ DRF బృందాలకు కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.
Ilayaraja: ఇళయరాజాతో పెట్టుకుంటే.. తిప్పలు తప్పవా?
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తార్నాక, నాచారం, ఉప్పల్, రామంతాపూర్, బండ్లగూడ, మణికొండ, పుప్పాలగూడ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలలో వర్షానికి డ్రెయిన్లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. బండ్లగూడలో కొన్ని అపార్ట్‌మెంట్లలోకి కూడా నీరు చేరింది. ప్రయాణికులు తమ రూట్లను ముందుగానే చూసుకోవాలని సూచించబడింది.
Rakul Preet : రకుల్ పరువాల నిధులు.. చూస్తే మతులు పోవాల్సిందే
