Mayor Vijayalakshmi: తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరద నీటితో నదులు, వాగులు పొంగిపొర్లడంతో ప్రాజెక్టులు, చెరువులు ప్రమాదకరంగా మారాయి. రోడ్లు, కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో పాటు మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలను మేయర్ గద్వాల విజయలక్ష్మి స్వయంగా రంగంలోకి దిగి పరిశీలిస్తున్నారు.
Read also: G20 Summit: “ప్రెసిడెంట్ ఆఫ్ భారత్”.. వివాదం అవుతున్న రాష్ట్రపతి ఆహ్వానం..
హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి స్వయంగా బల్కంపేట ప్రాంతంలో పర్యటించి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిలబడి మోకాళ్లలోతు వర్షపు నీటిలో నడిచారు. ప్రజలతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్న అధికారులు తగు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. మేయర్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు రోడ్లపై నిలిచిన వరదనీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది పర్యటిస్తున్నారు. అలాగే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీనిని పరిశీలించిన మేయర్ అక్కడ కూడా నీటిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మియాపూర్ ప్రాంతంలో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్ పల్లిలో 14.3, శివరాంపల్లిలో 13, గాజుల రామారంలో 12.5, బోరబండలో 12.5, జీడిమెట్లలో 12.1, షాపూర్, మూసాపేట్, జూబ్లీహిల్స్‌లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Read also: Rajaiah-Vinay Bhasker: రాజయ్య ఇంటికి వినయ్ భాస్కర్.. బుజ్జగింపుల ప్రక్రియ ప్రారంభం..?
భారీ వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు, మురికివాడలు వరద నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ సెల్లార్లు, ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. మూసీలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హసన్ సాగర్ లోకి కూడా భారీగా వరద వచ్చి చేరుతోంది. లింగంపల్లి అండర్‌పాస్ వంతెనపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అదేవిధంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై గుంతల్లో వరద నీరు నిలవడంతో వాహనాలు నిదానంగా వెళ్లడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. భారీ వర్షాలు కురిసే దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలు కురిస్తే ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ అధికారులకు సూచించారు.
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు.. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు ఎంతంటే..!