NTV Telugu Site icon

Hyderabad Power Cut: నేడు నగరంలో పవర్‌ కట్‌.. ప్రాంతాల వారీగా షెడ్యూల్..

Hyderabad Power Cuts

Hyderabad Power Cuts

Hyderabad power cut schedule today: నగరవాసులకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచన చేశారు. అయితే కరెంట్ కోతలకు గల కారణాలను అధికారులు వివరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గోడలు కూలి, చెట్లు విరిగిపడి, పిడుగులు పడి మొత్తం 14 మంది మృత్యువాతపడ్డారు. నాగర్​కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షం కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలోనే 8 మంది చనిపోయారు. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయాయి.

Read also: PM Modi in Bengal: నేడు బెంగాల్లో ప్రధాని మోడీ పర్యటన.. కోల్‌కతాలో రోడ్ షో

ఈనేపథ్యంలో పెరిగిన కొమ్మలు విద్యుత్ తీగలకు అంతరాయం కలగకుండా చూసేందుకు సైఫాబాద్ డివిజన్‌లో తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అధికారులు ఇవాళ చెట్ల నరికివేత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రెండు గంటల వరకు విద్యుత్ కోత పడే అవకాశం ఉందని వెల్లడించారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగిస్తామని, విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయిస్తామని, అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరెంటు కోతలు ఉంటాయని, కానీ రోజూ ఉండదన్నారు. ఒక్కో ఫీడర్ ఏరియాలో ఎన్ని గంటలు పవర్ కట్ ఉంటుందనేది అధికారులు వెల్లడించారు.

Read also: SSMB 29: మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ నటుడు!

ప్రాంతాల వారీగా షెడ్యూల్:

* ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు: 11kv లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఫీడర్

* కవర్ చేయబడిన ప్రాంతాలు: లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఏరియా, డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఏరియా, సుజాత స్కూల్ ఏరియా, మెడ్విన్ హాస్పిటల్ ఏరియా, చాపల్ రోడ్ ఏరియాలోని విజయా బ్యాంక్, మహేష్ నగర్ ప్రాంతం.

* మధ్యాహ్నం 12:30 నుండి 2:00 వరకు: 11kv బాబుఖాన్ ఎస్టేట్ ఫీడర్

* కవర్ చేయబడిన ప్రాంతాలు: బాబూఖాన్ ఎస్టేట్ ప్రాంతం, LB స్టేడియం రోడ్డు, HP పెట్రోల్ పంపు ప్రాంతం, కమిషనర్ కార్యాలయం, నిజాం హాస్టల్ ప్రాంతం, LB స్టేడియం, జగదాంబ జ్యువెలర్స్ భవనం.

* మధ్యాహ్నం 3:00 pm నుండి 4:30 pm: 11kv AP టూరిజం ఫీడర్

* కవర్ చేయబడిన ప్రాంతాలు: అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ ప్రాంతం, లిబర్టీ పెట్రోల్ పంప్ ప్రాంతం, ఆయిల్ సీడ్స్ క్వార్టర్స్ ప్రాంతం, స్టాంజా భవనం ప్రాంతం, దాదుస్ స్వీట్ షాప్ ప్రాంతం.

Tuesday Stotram: మంగళవారం ఈ స్తోత్రాలు వింటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి

Show comments