Site icon NTV Telugu

FIR on GST Officers : ఐదుగురు జీఎస్టీ అధికారులపై కేసు నమోదు

Gst

Gst

సెర్చ్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా నిర్బంధించారంటు మహిళ ఫిర్యాదు మేరకు ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వ్యాపారవేత్త సత్య శ్రీధర రెడ్డి కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జీఎస్టీ అధికారులు సోదాలు చేశారు. అయితే ఈ సమయంలో.. సోదాలు అనంతరం శ్రీధర్ రెడ్డి భార్య రఘవి రెడ్డిను అక్రమంగా జీఎస్టీ అధికారులు నిర్బంధించిన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 27, 2019 రోజున తనని సెర్చ్ ఆపరేషన్ పేరుతో నిర్భదించిన అధికారుల పై నేషనల్ మహిళ కమిషన్‌కి శ్రీధర్‌ రెడ్డి భార్య రఘవి రెడ్డి ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో నేషనల్ మహిళా కమిషన్ నుండి హైదరాబాద్ పోలీసులకు సిఫార్స్ చేయడంతో.. బాధితురాలి వద్ద నుండి వివరాలు సేకరించిన హైదరబాద్ పోలీసులు.. ఐదుగురు అధికారులపై కేస్ నమోదు చేశారు. అయితే.. జీఎస్టీ అధికారులు బోలినేని గాంధీ, చిలుక సుధ రాణి, ఇసాబెల్లా,ఆనంద్ కుమార్, కుచ్ లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. గతంలోనే బొల్లినేని గాంధీపై సీబీఐ కేసు నమోదైంది. ఇప్పటికే సస్పెషన్‌లో బొల్లినేని గాంధీ , చిలక సుధా ఉన్నారు.

Exit mobile version