Site icon NTV Telugu

Pudding and Mink Pub: తేగ్గేదేలే అంటున్న పోలీసులు..

Pudding And Mink

Pudding And Mink

పుడ్డింగ్ అండ్ మింకి పబ్ వ్యవహారంలో పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతుంది. పబ్ లోపలికి డ్రగ్స్ ఎలా వచ్చాయని దానిపైన పోలీసుల విచారణ దాదాపుగా పూర్తి చేశారని చెప్పవచ్చు. అయితే పబ్ లోపలికి డ్రగ్స్ తీసుకు వచ్చిన వారిని పోలీసులు గుర్తించారు .. పబ్ పై దాడి చేసి 148 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు వ్యక్తులు పబ్ లోకి డ్రగ్స్ తీసుకొని వచ్చినట్టుగా తేలింది. అయితే పబ్ యజమానికి వ్యవహారం మొత్తం తెలిసే డ్రగ్స్ లోపలికి తీసుకొని వచ్చారని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే.. యజమానితో పాటు మేనేజర్‌ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తీసుకున్నారు . నాలుగు రోజులపాటు పోలీస్ లు కస్టడీ లోకి కోర్టు అనుమతి తీసుకొని విచారించారు.

అయితే డ్రగ్స్ లోపలికి ఎలా వచ్చాయో తమకు తెలియదని మేనేజర్ తోపాటు యజమాని కూడా చెప్పాడు. పోలీసులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా కేసు లోతుగా పరిశీలన చేశారు. నలుగురు వ్యక్తులు కలిసి లోపలికి డ్రగ్స్ తీసుకొని వచ్చి ఉంటారని పోలీసులు చెప్తున్నారు. గుర్తించిన నలుగురికి పోలీసులు నోటిసులు జారి చేయబోతున్నారు. పబ్బు లోపలికి డ్రగ్స్ తీసుకొని వచ్చిన వారిని త్వరలోనే పట్టుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.

Exit mobile version