గంజాయి స్మగ్లర్లు కొత్తకొత్త రూట్లలో ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. కొత్త తరహాలో కొత్త రూట్ లో పుష్పకు మించిన తెలివితేటలతో గంజాయిని సిటీలకు చేరవేస్తున్నారు…గంజాయి స్మగ్లర్లు తెలివితేటలు చూసి పోలీసులు అవాక్కవుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో 70 కిలోల గంజాయిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి నేరుగా హైదరాబాద్ గల్లిలోకి చేరవేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి రోడ్డు మార్గం ద్వారా స్మగ్లింగ్ జరుగుతోందని పోలీసులు భావించారు. ఈ గంజాయిని ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న ఐదుగురు మహిళలని తేలడంతో పోలీసులు సైతం విస్తుపోయారు. కానీ కొత్త తరహాలో కొత్త పంథాలో గంజాయిని ఏజెన్సీ నుంచి నేరుగా హైదరాబాద్ గల్లి గల్లి లోకి చేరుకుంటుంది. దీనిని గుర్తించిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గ్యాంగ్ ను నేరుగా పట్టుకోవడం జరిగింది.
గంజాయి రవాణా కోసం మహిళల్ని వాడుకున్న తీరు పోలీసులు సైతం అవాక్కయ్యారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఐదుగురు మహిళలు తమ బ్యాగ్ లతో బయలుదేరుతారు. బస్సుల ద్వారా వైజాగ్ కి చేరుకుంటారు. అక్కడ ఏసి కోచ్ లలో అప్పటికే తమ కోసం రిజర్వు చేసిన సీట్స్ ఐదుగురు మహిళలు కూర్చుంటారు. వీరితో పాటు తెచ్చిన బ్యాగులను ఒక్కొక్క చోట పెట్టి హాయిగా నిద్ర పోతారు. ఉదయానికి ట్రైన్ నేరుగా హైదరాబాద్ చేరుకుంటుంది. తాము పెట్టిన బ్యాగులను తీసుకొని నేరుగా హైదరాబాదులోని గంజాయి స్మగ్లర్ వద్దకు మహిళలు చేరుకుంటారు. తమ వెంట తెచ్చిన బ్యాగులను వాళ్ళకి అప్పగిస్తారు.. ఈ బ్యాగ్ లలు గంజాయి ఉంటుంది.. అయితే అది కూడా ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుంది.. ఒక్కొక్క బ్యాగ్ లో ఐదు కిలోల చొప్పున గంజాయి ప్యాక్ చేసి తీసుకు వస్తారు. బట్టలు బ్యాగ్ అడుగు ప్రత్యేకమైన సొరగు ఏర్పాటు చేసుకుని అందులో గంజాయి పెట్టుకొని వీళ్లు హైదరాబాద్ వరకు తీసుకు వస్తున్నారు.
ఇప్పటి వరకు కొన్ని వందల పైచిలుకు గంజాయి నీ ఐదుగురు మహిళలు హైదరాబాద్‌కు తీసుకొని వచ్చారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఐదుగురు మహిళలు అరెస్టు చేయడంతో అసలు విషయం బట్టబయలైందని తెలిపారు. ఈ గ్యాంగ్ వెనకాల రమేష్ అనే గంజాయి స్మగ్లర్ ఉన్నాడని పోలీసుల విచారణలో బయట పడింది. రమేష్ ని పట్టుకోడానికి వెళ్తే డ్రగ్స్ సరఫరా చేసే ముఠా బయటపడింది. ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న ఖాద్రి, సయీద్ ప్రధాన సూత్రధారని తేలింది. ఈ ఇద్దరు కలిసి ముంబై నుంచి బ్రౌన్ షుగర్ ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్, ఢిల్లీ, ముంబై చెన్నై లాంటి పట్టణాలకు డ్రగ్స్ చేరవేస్తూ ఉన్నట్లుగా బయటపడింది.. ఈ ఇద్దరి వెనకాల డ్రగ్స్ ప్రధాన సూత్రధారి మరొకరు ఉన్నట్టుగా పోలీసుల విచారణలో వెలుగుచూసింది. మహేష్ అనే డ్రగ్ కింగ్ పిన్ ఈ వ్యవహారం మొత్తం వెనకాల ఉండి నడిపిస్తున్నట్లుగా వెలుగుచూసింది. దీంతో రమేష్ ,మహేష్ లను పట్టుకోవడానికి పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు.
గత పది పదిహేను రోజుల నుంచి ముంబై, బెంగళూరు, గోవా లాంటి పట్టణాల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు మకాం వేశారు. అయినప్పటికీ కూడా ప్రధాన సూత్రధారి మహేష్ ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు. దీంతో తాము అరెస్ట్ చేసిన ఐదుగురు మహిళలతో పాటు నలుగురు డ్రగ్ సప్లయర్స్ ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ ముఠా దగ్గర్నుంచి 260 గ్రాముల బ్రౌన్ షుగర్ తో పాటు 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంబై కేంద్రంగా మహేష్ అన్ని రాష్ట్రాల్లో తన నెట్వర్క్ పెట్టుకున్నాడని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ముఖ్యంగా గంజాయితో పాటు అన్ని రకాల సింథటిక్ డ్రగ్స్ లను మహేష్ గ్యాంగ్ సరఫరా చేస్తుంది. త్వరలోనే ఈ గ్యాంగ్‌ను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
