హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేస్తున్నారు. హీరో నాగశౌర్య ఫాంహౌస్ లో పేకాటరాయుళ్లను పట్టుకున్నారు.25 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులను చూసి బడాబాబులు పారిపోయారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని నార్సింగ్ మండలం మంచిరేవుల గ్రామంలో పేకాట ఆడుతున్నారు. ప్రముఖ యువహీరో నాగ శౌర్య ఫాంహౌస్ లో పేకాట ఆడుతున్నారు. ఏకకాలంలో ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించడంతో 25 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖులు కలిసి పేకాట ఆడారు. పోలీసులను చూసి పారిపోయారు పేకాటరాయుళ్లు. లోతుగా విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలియజేయడమైనది.
హైదరాబాద్ లో పేకాట స్థావరాలపై పోలీసుల వరుస దాడులు…
