హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అరగంట నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. కురుస్తున్న వర్షం.. నల్లటి మేఘాలతో చిమ్మ చీకటిగా హైదరాబాద్ నగరం మారిపోయింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే రాత్రి వాతావరాణాన్ని తలపించింది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లమీద వరద నీరు భారీగా చేరుకొంది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణశాఖ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.